Viral News : CV లో గృహిణిగా 13 సంవత్సరాల అనుభవం ఉందంటూ హైలైట్ చేసిన మహిళ.. అభినందిస్తున్న జనం
ఇంటి బాధ్యతలు నిర్వహించడం ఒక పనా? అని తీసి పారేసే వారు ఉంటారు. ఓ మహిళ తన సీవీలో 13 సంవత్సరాలుగా గృహిణిగా తనకున్న అనుభవాన్ని పొందుపరిచింది. అందరి అభినందనలు అందుకుంటోంది.

Viral News
Viral News : గృహిణిగా ఉన్న ఆడవారు తమ కష్టాన్ని గుర్తించట్లేదని బాధపడుతూ ఉంటారు. బయట జాబ్స్ కంటే ఇంట్లో పనులు చాలా కష్టమని అంటూ ఉంటారు. ఏ జాబ్ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ చేసిన సీవీలో అయినా గృహిణి పాత్రను తన అర్హతగా ఇప్పటి వరకూ ఏ మహిళ అయినా చూపించి ఉంటారా? ఓ మహిళ గృహిణిగా తన అనుభవాన్ని CV లో పొందుపరిచి అందరి అభినందనలు అందుకుంటోంది.
సాధారణంగా CV లో విద్యార్హతలతో పాటు ఎక్కడెక్కడ పని చేసిన అనుభవం ఉందో పొందుపరుస్తాము. అయతే ఓ మహిళ తన సీవీలో తాను గతంలో పని చేసిన ఉద్యోగ అనుభవాలతో పాటు 13 సంవత్సరాలుగా గృహిణిగా ఉంటూ నిర్వహిస్తున్న బాధ్యతల్ని కూడా పొందుపరిచింది. ఈ సీవీని కంటెంట్ మార్కెటింగ్ కంపెనీ గ్రోతిక్ ఫౌండర్ యుగన్ష్ చోక్రా లింక్డ్‌ఇన్‌లో షేర్ చేసారు. ‘ఈ ప్రత్యేకమైన సీవీని చూసాము. ఆమెకు గృహిణిగా 13 సంవత్సరాల అనుభవం ఉంది. నేను దీనిని ఇష్టపడటానికి కారణం కుటుంబం నిర్వహించడం అనేది నిజమైన పని, దీనిని తక్కువగా అంచనా వేయలేం.. ఇండియాలో 20% కంటే తక్కువ మంది మహిళలు వృత్తిపరమైన సామర్థ్యంతో పనిచేస్తున్నారు. పిల్లలు, ఇంటి బాధ్యతల్ని చూసుకోవడం నిజమైన పని.. కుటుంబం కోసం నిర్వహించే పనిని తక్కువ చేసి చూడలేం..’ అంటూ పోస్టు చేశారు.
Strange Rules For employee : ఈ ఉద్యోగం మద్యంపానం, ధూమపానం, మాంసాహారం అలవాటు లేనివారికి మాత్రమే
జూలై 2009 లో ఆ మహిళ తన చివరి ఉద్యోగాన్ని విడిచి పెట్టిందని చోక్రా షేర్ చేసిన CV చూపిస్తోంది. ఆ టైంలో రిక్రూట్ మెంట్ నిర్వహించే బాధ్యతను నిర్వర్తించింది. ప్రస్తుతం ఆమె 13 సంవత్సరాలుగా గృహిణి ఉంది. సీవీలో తన ఇంటిని ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తోందో చెబుతూ తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. అందరి మన్ననలు అందుకుంటోంది.