కూలిన డ్యామ్ : 300 మంది గల్లంతు

  • Published By: chvmurthy ,Published On : January 26, 2019 / 12:05 PM IST
కూలిన డ్యామ్ : 300 మంది గల్లంతు

బ్రెజిల్ :ఆగ్నేయ బ్రెజిల్ లో ఆనకట్ట కూలిన ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 300 మంది గల్లంతయ్యారు. బ్రెజిల్ లోని ప్రముఖ  ఐరన్ ఓర్ మైనింగ్ కంపెనీ “వాలే”  వ్యర్ధ పదార్ధాలను వేరు  చేసేందుకు నిర్మించిన ఆనకట్ట కూలిపోవటంతో ఈ దుర్ఘటన జరిగింది.
భారత కాలమానం ప్రకారం  శనివారం తెల్లవారుఝూమున ఈ ఘటన సంభవించింది. ఆనకట్ట కూలిపోవటంతో భారీ స్ధాయిలో బురద, వరదలా పొంగి సమీపంలోని ఓ భవనాన్ని తాకింది. దాంతో ఆ భవనంలో ఉన్న వారంతా బురదలో కొట్టుకుపోయారు. వీరిలో 9 మంది మృత దేహాలను వెలికి తీశారు. మిగిలిన వారి కోసం హెలికాప్టర్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  ఈ ఘటనలో కార్లు బస్సులు కొట్టుకు పోయాయి.  మరణించిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.  మూడేళ్ళ క్రితం మినాస్ గెరాయిస్‌లోనే ఓ పట్టణంలో డ్యామ్ కూలిన ఘటనలో 19 మంది మృతి చెందారు.