‘Dancing Dad’Dances : షారూఖ్ ‘చమ్మక్ చల్లో’ పాటకు అమెరికా కపుల్స్ అదిరిపోయే డ్యాన్స్

నెటిజన్లు ముద్దుగా డ్యాన్సింగ్ డాడ్ అని పిలుచుకునే అమెరికన్ రీకీపాండ్ షారూఖ్ ఖాన్ పాటకు అద్దిరిపోయే స్టెప్పులేసారు.తన భార్యతో కలిసి ‘చమ్మక్ చల్లో’ పాటకు చక్కటి స్పెప్పులేసారు.

‘Dancing Dad’Dances : షారూఖ్ ‘చమ్మక్ చల్లో’ పాటకు అమెరికా కపుల్స్ అదిరిపోయే డ్యాన్స్

“dancing Dad” Dances (1)

Updated On : August 31, 2021 / 3:33 PM IST

“Dancing Dad”, Ricky Pond Couple Dances To ‘Chammak Challo’ : బాలీవుడ్ బాద్ షా. షారూఖ్ ఖాన్ కు ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. షారూఖ్ యాక్టింగ్ అంటే పిచ్చెక్కిపోయేవారున్నారు. ఇదిలా ఉంచితే..అమెరికన్ రీకీపాండ్ గుర్తున్నారు కదూ. గతంలో భోజపూరీ పాట లాలీపాప్ లాగేలు, తెలుగులో అల్లుఅర్జున్ బుట్టబొమ్మ పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టిన రికీపాండ్ బాద్ షా పాటతో మరోసారి అద్దరగొట్టే స్టెప్పలేశారు.

American Dad Dances To Bollywood Songs With His Kids and Goes Viral on Instagram [Videos]

తన 25వ పెళ్లి రోజు సందర్బంగా భార్యతో కలిసి ఆనందంగా స్టెప్పులు వేసిన రికీపాండ్ బాలివుడ్ బాద్ షా, కరీనా కపూర్ నటించిన సూపర్ హిట్ సాంగ్ ‘చమ్మక్ చల్లో’ పాటకు స్టెప్పులతో ఇదరగదీశారు తన భార్యతో కలిసి. ఈసారి రికీపాండ్ చమ్మక్ చల్లో పాటకు తన భార్య తో కలిసి స్టెప్పులు వేశారు.

అమెరికన్ రీకీపాండ్.. తన 25వ పెళ్లి రోజు సందర్బంగా భార్యతో కలిసి ఆనందంగా స్టెప్పులు వేశాడు. చమ్మక్ చల్లో పాటకు ఆయన వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రికీపాండ్ ను డ్యాన్సింగ్ డాడ్ అంటూ నెట్టింట ముద్దుగా పిలుచుకుంటున్నారు.

imgk.timesnownews.com/story/dancing_dad_ricky_p...

రికీపాండ్ ఇండియన్ పాటలకు డ్యాన్స్ వేయడం మాత్రమే కాదు.. భారత సంప్రదాయానికి సంబంధించిన దుస్తులు ధరించి డ్యాన్స్ వేయటం మరో విశేషం అని తప్పకుండా చెప్పాలి. రికీ పాండ్ కుర్తా పైజామా ధరించగా.. అతని భార్య కుర్తా, గాగ్రా ధరించారు.

ఈ వీడియోని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసి.. చమ్మక్ చల్లో.. 25వ పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ కూడా జత చేశారు.బాద్ షా పాటకు ఈ అమెరికన్ కపుల్స్ వేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Ricky Pond (@ricky.pond)