భారత్ లో కాలుష్యం అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చే నగరం దేశ రాజధాని ఢిల్లీ. మరి ప్రపంచంలోనే 20 కాలుష్యపూరిత నగరాలలో భారత్ లో కాలుష్యం అత్యంత ప్రమాదకరంగా ఉంది. టాప్ 20 అత్యంత కాలుష్యపూరిత నగరాలలో 15 భారత్‌లో ఉండటం గమనించాల్సిన విషయం. ఎయిర్ విజువల్, ఎన్జీవో గ్రీన్‌పీస్ సంస్థలు చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
Also Read : పుల్వామా ఉగ్రదాడి కాదు.. యాక్సిడెంట్
పీఎమ్ (పర్టిక్యులేట్ మ్యాటర్) 2.5 ఆధారంగా నగరాల కాలుష్యాన్ని వెల్లడించారు. 2017కు గానూ టాప్ 20లో 14 భారత నగరాలుండగా, 2018 ఏడాదికిగానూ మరో నగరం చేరి ఆ సంఖ్య 15కు చేరడం ఆందోళనకు గురిచేస్తోంది. అత్యంత కాలుష్య రాజధానులలో భారత రాజధాని ఢిల్లీ 113.5 పాయింట్లతో మొదటిస్థానంలో ఉంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా..అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్ ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో..
గురుగ్రామ్ (భారత్) (135.8)
ఘజియాబాద్ (భారత్) (135.2)
ఫైసలాబాద్ (పాకిస్థాన్) (130.4)
ఫరీదాబాద్ (భారత్) (129.1)
భివాడి (125.4) కూడా టాప్ లో ఉన్నాయి.
నోయిడా (123.1)
పాట్నా (119.7)
హోతాన్ (116.0)
లక్నో (115.7)
లాహోర్ (114.9)
భారత్ లోని టాప్ పొల్యూషన్ నగరాలు
కాలుష్యపూరిత నగరాల జాబితాలో టాప్ 5లో 4 భారత నగరాలుండగా టాప్ 10కి వస్తే..మొత్తంగా 7 భారత నగరాలు జాబితాలో ఉన్నాయి. టాప్ 10లో చైనా నుంచి హోతాన్ (8), పాక్ నుంచి ఫైసలాబాద్‌తో పాటు లాహోర్ (10వ స్థానం) ఉన్నాయని..ఎయిర్ విజువల్, ఎన్జీవో గ్రీన్‌పీస్ సంస్థలు చేపట్టిన సర్వేలో వెల్లడయ్యింది.