ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు: వేగంగా విస్తరిస్తున్న కరోనా కేసులు.. నాలుగు రోజుల్లోనే లక్ష మందికి!

  • Published By: vamsi ,Published On : March 24, 2020 / 02:40 AM IST
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు: వేగంగా విస్తరిస్తున్న కరోనా కేసులు.. నాలుగు రోజుల్లోనే లక్ష మందికి!

Updated On : March 24, 2020 / 2:40 AM IST

మనవాళి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎదుర్కొంటున్న సంక్షోభం ‘కరోనా వైరస్’. ఈ వైరస్ కారణంగా ఎంతోమంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది వ్యాధి సోకి ఇబ్బందులు పడుతున్నారు. ఈ కరోనా వైరస్ చాలా సాధారణంగా కనిపించే లక్షణాలతో ప్రాణాలు హరించే ప్రమాదకరమైన వైరస్.. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలతో తక్కువ టైమ్‌లోనే మనుషుల ప్రాణాలు తీస్తుంది.

చైనాలోని వుహాన్‌లో పుట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి భయపెడుతున్న ఈ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. మొదట్లో కేవలం చైనాకు మాత్రమే పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక్క అంటార్కిటికా ఖండంలో తప్ప అన్ని ఖండాలకు విస్తరించింది. రోజూ వేలాదిగా కొత్త కేసులు నమోదవుతునే ఉన్నాయి. వ్యాధి లక్షణాలును ఇంకా నిర్ధారించని కేసులు ఎన్ని ఉంటాయనేదానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.

ఇదిలా ఉంటే అతి వేగంగా విస్తరిస్తున్న కరోనా గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చెబుతున్న లెక్కలు చూస్తుంటే గుండెలు గుబేలుమంటాయి. కరోనా వైరస్ భారిన పడిన కేసు సంఖ్య తొలి లక్ష చేరుకోవడానికి 67రోజుల టైమ్ పడితే రెండు లక్షల కేసులు అవడానికి 11రోజులు టైమ్ పట్టిందట. అయితే మూడు లక్షల మార్క్ చేరుకోవడానికి నాలుగు రోజులు పట్టడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలవరపెడుతుంది. ప్రపంచదేశాలను వణికిస్తున్న ఈ వైరస్.. ఎంత వేగంగా విస్తరిస్తుంది అనే విషయం ఈ లెక్కలు బట్టి అర్థం అవ్వాలి.

See Also | ఇక హైదరాబాద్‌లోనే కరోనా టెస్టులు