Designer Bag : అతి చిన్న డిజైనర్ బ్యాగ్.. వేలంలో దాని ధర రూ.51 లక్షలు
ఉప్పు రవ్వ కంటే చిన్నదిగా ఉండే డిజైనర్ బ్యాగ్ చూస్తేనే ఆశ్చర్యపోతారు. ఇక దాని ధర వింటే నోరెళ్లబెడతారు.. అక్షరాల వేలంపాటలో రూ.51 లక్షలు పలికింది. నిజం.

Designer Bag
Designer Bag : కొన్ని వేలంపాటలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. వేలానికి వేసే వస్తువులు ఎందుకు అంత రేటుకు అమ్ముడుపోతాయో అర్ధం కాదు. ఓ డిజైనర్ బ్యాగ్ ఉప్పు రవ్వ కంటే చిన్నగా ఉంటుంది.. వేలంలో రూ.51 లక్షలకు అమ్ముడుపోయింది. ఆశ్చర్యంగా ఉంది కదా. నిజమే.
costly sandwich : వరల్డ్ రికార్డ్ సాధించిన ఆ శాండ్ విచ్ ధర వింటే అదిరిపడతారు
3డి ప్రింట్ మైక్రో-స్కేల్ ప్లాస్టిక్ భాగాలకు ఉపయోగించే రెండు ఫోటో పాలిమరేజేషన్ ఉపయోగించి అతి చిన్న బ్యాగ్‌ను న్యూయార్క్ ఆర్ట్ కలెక్టివ్ MSCHF ( MICROSCOPIC HANDBAG SELLS) రూపొందించింది. ఆన్ లైన్ వేలంలో ఇది $63,000 కి ( ఇండియన్ కరెన్సీలో రూ. 51.6 లక్షలు) విక్రయించబడింది. ఈ నెల ప్రారంభంలో MSCHF తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో బ్యాగ్ ఫోటోను పోస్ట్ చేసినప్పుడు ఇది ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టించింది. MSCHF క్యాప్షన్‌లో బ్యాగ్ సూది కంటి నుంచి వెళ్లేంత ఇరుకైనది.. మరియు సముద్రపు ఉప్పు రవ్వ కంటే చిన్నదిగా ఉందని వ్రాసింది.
బ్యాగ్ రెండు-ఫోటో పాలిమరైజేషన్ ఉపయోగించి తయారు చేయబడింది. కొనుగోలుదారు బ్యాగ్‌ను చూడగలిగేలా డిజిటల్ డిస్‌ప్లేతో కూడిన మైక్రోస్కోప్‌తో పాటు బ్యాగ్ విక్రయించబడింది. MSCHF 2016లో స్థాపించబడింది .. విచిత్రమైన వేలానికి ఇది ఎంతగానో ప్రసిద్ధి చెందింది.