Afghan Mums: మా పిల్లలను తీసుకెళ్లండి.. కంచెపై నుంచి విసిరేస్తున్న తల్లులు!

తాలిబన్ల చెర నుంచి తప్పించుకునేందుకు అప్ఘాన్ వాసులు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో తాలిబన్ల అప్ఘాన్లపై దాడులకు తెగబడుతున్నారు.

Desperate Afghan Mums Throw Babies Over Barbed Wire Fences And Beg Soldiers To Take Them

Desperate Afghan mums : తాలిబన్ల చెర నుంచి తప్పించుకునేందుకు అప్ఘాన్ వాసులు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో తాలిబన్ల అప్ఘాన్లపై దాడులకు తెగబడుతున్నారు. కాబూల్ విమానాశ్రయంలోకి వెళ్లకుండా తాలిబన్లు ఇనుప కంచెలను అడ్డుగా పెట్టేశారు. సరిహద్దుల్లో తప్పించుకునే ప్రయత్నంలో అప్ఘన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్ఘాన్ తల్లులు తమ పిల్లలతో సరిహద్దులను దాటే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇనుప కంచెలు అడ్డుగా ఉండటంతో పిల్లలను ఎలాగైనా రక్షించుకోవాలనే ఉద్దేశంతో బ్రిటీష్ సైన్యం వైపునకు విసిరేస్తున్నారు. తమ పిల్లలను తీసుకెళ్లాంటూ బ్రిటిష్ అధికారులను వేడుకుంటున్నారు. ఈ హృదయ విదారక ఘటనలపై బ్రిటీష్ ఆర్మీ సీనియర్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.

అప్ఘాన్‌లో చిక్కుకుపోయిన దేశ పౌరులను తరలించేందుకు అమెరికా, యూకే ప్రత్యేక బలగాలను పంపింది. కాబుల్ ఎయిర్ పోర్టును తమ ఆధీనంలోకి తీసుకుంది. తాలిబన్ల ఆక్రమణతో భయాందోళనకు గురైన అప్ఘాన్ వాసులు దేశం విడిచి పారిపోతున్నారు. ఈ క్రమంలో అప్ఘన్లంతా ఎయిర్ పోర్టుకు పరుగులు తీస్తున్నారు. విమానాశ్రయం వద్దకు తాలిబన్లు చేరుకుని అప్ఘాన్ వాసులను అడ్డుకుంటున్నారు. ఇనుప కంచెలను అడ్డుగా పెట్టేశారు. దాంతో అప్ఘాన్ వాసులంతా బోరుమని విలపిస్తూ తమను కాపాడాలంటూ యూకే, యూఎస్ బలగాలను వేడుకుంటున్నారు.

కనీసం తమ పిల్లలనైనా తీసుకెళ్లాంటూ ప్రాధేయపడుతున్నారు. అఫ్ఘాన్ వాసుల్లో కొందరు తల్లులైతే ఏకంగా తమ పిల్లలను ఇనుప కంచె నుంచి అవతలవైపుకు విసిరేస్తున్నారు. విదేశీ బలగాలను పట్టుకోమని వేడుకుంటున్నారు. కొందరు చిన్నారులు కంచెలో చిక్కుకుని గాయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ విషాదకర దృశ్యాలను చూసి తాను చలించిపోయినట్టు బ్రిటీష్ అధికారి ఒకరు తెలిపారు.