భారత్‌లో దాడుల కోసం లోకల్ గ్యాంగ్‌స్టర్లను పెంచిపోషిస్తున్న ISI

భారత్‌లో దాడుల కోసం లోకల్ గ్యాంగ్‌స్టర్లను పెంచిపోషిస్తున్న ISI

Updated On : August 25, 2020 / 5:39 PM IST

ఇండియాలో ఉన్న సెక్యూరిటీ ఏజెన్సీలు, ఇంటెలిజన్స్ వర్గాల అటెన్షన్ అట్రాక్ట్ చేయడం ట్రెండ్‌గా మారిపోయింది. భారత్ లో దాడులు చేయడానికి యత్నించి ఫెయిల్ అయిన పాకిస్తాన్‌కు చెందిన ISI, టెర్రర్ గ్రూపులు మరో ఎత్తుగడను ప్లాన్ చేశాయి. లా అండ్ ఆర్డర్ ను డిస్టర్బ్ చేయడానికి లోకల్ గ్యాంగ్‌స్టర్లకు టాస్క్ లు ఇచ్చి అలర్ట్ చేస్తున్నాయి.

ఇటీవలే ఛండీఘడ్ ఇంటిలిజెన్స్ యూనిట్ అన్నీ ఏజెన్సీ యూనిట్లను అలర్ట్ చేసింది. టెర్రరిస్టులకు, గ్యాంగ్ స్టర్ల మధ్య సంబంధాలు నడుస్తున్నాయని హెచ్చరించింది. కొందరి గ్యాంగ్‌స్టర్ల పేర్లు బయటపెట్టి ఐఎస్ఐ, టెర్రరిస్టు ఆర్గనైజేషన్లతో టచ్ లో ఉంటున్నారని ఇండియాలో టాస్క్ లు ఎగ్జిక్యూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పింది. వారిని అదుపులోకి తీసుకుని జైల్లో పెట్టగా కొందరు మాత్రం పారిపోయారు.

లోకల్ గ్యాంగ్‌స్టర్లతో టచ్ లో ఉండాలని లేదా.. కమ్యూనికేషన్ ను కొనసాగించాలని వారు ప్రయత్నిస్తారని సీనియర్ గవర్నమెంట్ అధికారి వెల్లించారు. సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ పంజాబ్ యూనిట్ కొద్ది రోజుల క్రితమే అలర్ట్ చేసింది. ఐదుగురు లీడర్లను టార్గెట్ చేయాలని ఐదుగురు గ్యాంగ్ స్టర్లను పురమాయించారు. వారిలో ఇద్దరు పరారీలో ఉన్నారు. మిగిలిన ముగ్గురిని వేర్వేరు జైళ్లల్లో ఉంచారు.

లేటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం.. అన్నీ స్లీపర్స్ సెల్స్ ను దాదాపు మట్టుబెట్టేశారు. చెప్పిన పని చేయడానికి నిరాకరిస్తారనే భయంతో సెక్యూరిటీ ఫోర్సెస్ వారిని చంపేశాయి.