సాకర్ దిగ్గజం మారడోనాకి అరుదైన గౌరవం

ప్రపంచంలోని గొప్ప ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఒకరైన అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ డియెగో మారడోనా కన్నుమూసిన తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా అతని అభిమానులు అతనిని గుర్తు చేసుకుంటూ పలురకాల కార్యక్రమాలు చేస్తున్నారు. మారడోనా మరణం తరువాత, అభిమానులు రకరకాల కార్యక్రమాలతో అతను గుర్తుండిపోయేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కేరళకు చెందిన ఒక వ్యాపారవేత్త మరడోనా జ్ఞాపకార్థం మ్యూజియం నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.
బాబీ చెమ్మనూర్ ఇంటర్నేషనల్ గ్రూప్ చైర్మన్ బాబీ చెమ్మనూర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు డియెగో మారడోనా జ్ఞాపకార్థం.. తమ దేశానికి ఎంతో పేరు తెచ్చిన వ్యక్తి గౌరవార్ధం.. కరెన్సీపై మారడోనా బొమ్మను ముద్రించేందుకు సన్నాహాలు చేస్తుంది అర్జెంటీనా ప్రభుత్వం. ‘లా పంపా’ ప్రావిన్స్ సెనెటర్ నార్మా డ్యూరాంగో ఈ మేరకు సోమవారం ప్రజాప్రతినిధుల సభ ‘కాంగ్రెస్’కు ప్రతిపాదనను పంపింది. 1000 పెసో నోటుపై ఒకవైపు మారడోనా చిత్రాన్ని, మరోవైపు ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ నమూనాను పొందుపరిచేలా ప్రతిపాందించారు.
సాకర్ మాంత్రికుడిగా పేరు పొందిన, డియెగో మారడోనా.. బ్రెజిల్‌కు చెందిన పీలే తర్వాత సాకర్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. ఎన్నో పర్యాయాలు ఒంటిచేతితో అర్జెంటీనాను గెలిపించిన అతను.. 1986లో అర్జెంటీనా జట్టుకు కెప్టెన్‌గా ఉండి ప్రపంచ కప్ ఫుట్‌బాల్ ట్రోఫీని సాధించి పెట్టడమే కాకుండా 1990 ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌లో పైనల్ దశకు చేరి రన్నరప్‌గా నిలిపాడు. 1990 వరల్డ్ కప్ పైనల్స్‌లో జర్మనీ చేతొలో ఓడిపోయాక కంతతడి పెట్టడం అభిమానులను కలచివేసింది. సాకర్ చరిత్రలోనే అతనిది ఒక సువర్ణ అధ్యాయం.
డియెగో మారడోనా 2012లో భారతదేశాన్ని సందర్శించారు. తన 52వ పుట్టినరోజును కేరళలోని కన్నూర్‌లో జరుపుకున్నారు. అప్పుడు మారడోనా ఫుట్‌బాల్ ఆకారంలో చేసిన 25కిలోల కేకును కత్తిరించాడు. డియెగో మారడోనా నవంబర్ 24న గుండెపోటుతో మరణించాడు. దీనిపై చట్టసభ సభ్యులదే తుది నిర్ణయం. ‘దిగ్గజాన్ని గౌరవించేందుకు మాత్రమే కాకుండా ఆర్థిక లావాదేవీల పరంగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చారు అక్కడి అధికారులు. అక్కడికి వెళ్లిన పర్యాటకులు ‘మారడోనా’ను తమతో తీసుకెళ్లేందుకు ఇష్టపడతారని, అక్కడి ప్రభుత్వం భావిస్తుంది.