Diwali Celebration: వైట్‌హౌస్‌లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న ప్రెసిడెంట్ జో బైడెన్.. వీడియో వైరల్

: అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో పాటు

Diwali Celebration: వైట్‌హౌస్‌లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న ప్రెసిడెంట్ జో బైడెన్.. వీడియో వైరల్

President Joe Biden

Updated On : October 29, 2024 / 10:23 AM IST

Diwali Celebration at White House: అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో పాటు కాంగ్రెస్ సభ్యులు, అధికారులతో సహా 600 మంది భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఉండటంతో ఉపాధ్యక్షురాలు కమలాహారిస్, దేశ ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. వేడుకల్లో భాగంగా బైడెన్ మాట్లాడుతూ.. దక్షిణాసియా అమెరికన్ సమాజాన్ని కొనియాడారు. తన పరిపాలనలో దక్షిణాసియా అమెరికన్లు పోషించిన కీలక పాత్రను బైడెన్ ప్రస్తావించారు.

Also Read: US Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఓటేసిన బైడన్.. బ్యాలెట్ బాక్సులకు నిప్పు పెట్టిన దుండగులు

వైట్ హౌస్ లోని బ్లూ రూమ్ లో బైడెన్ దీపం వెలిగించారు. దక్షిణాసియా అమెరికన్ కమ్యూనిటీ అమెరికా అభివృద్ధికి చేసిన కృషిని ప్రశంసించారు. అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, దేశం అభివృద్ధిలో అత్యంత నిమగ్నమై ఉన్న కమ్యూనిటీల్లో మీరూ ఉన్నారని బైడెన్ కొనియాడారు. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి నాసా వ్యోమగామి మరియు రిటైర్డ్ నేవీ కెప్టెన్ సునీతా విలియమ్స్ వీడియో ద్వారా సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.