నేడు శనిత్రయోదశి.. ఏం చేయాలి? కష్టాలన్నీ ఎలా పోతాయ్?
కాకులు, చీమలకు ఆహారం పెట్టాలి. శని, హనుమాన్ చాలీసాలు చదివితే శని బాధలు తగ్గుతాయి.
Shani Trayodashi (Image Credit To Original Source)
- శనీశ్వరునికి తైలాభిషేకం చేయాలి
- నల్లటి వస్త్రాలు, నువ్వులు దానం చేయాలి
- ఏలినాటి శని ప్రభావాలు తగ్గుతాయి
Shani Trayodashi: పంచాంగం ప్రకారం ఈ సారి జనవరి 31న శని త్రయోదశి వచ్చింది. శనివారం, త్రయోదశి తిథి కలిసి వచ్చే అరుదైన రోజు శనిత్రయోదశి (శని ప్రదోషం) అంటారు.
నల్లటి వస్త్రాలు, నువ్వులు దానం చేయడం, శనీశ్వరునికి ఇవాళ తైలాభిషేకం చేయడం ద్వారా శని దోషాలు, ఏలినాటి శని, అష్టమ శని ప్రభావాలు తగ్గుతాయని నమ్ముతారు. అలాగే.. కోర్టు కేసులు, అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు.
శివాలయంలోని శనీశ్వరుడిని లేదా నవగ్రహాలలోని శనిదేవుడిని పూజించాలి. నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. నల్లని వస్త్రాలు, నువ్వులు, నల్ల మినుములు, ఇనుమును దానం చేస్తే మంచిది.
కాకులు, చీమలకు ఆహారం పెట్టాలి. శని, హనుమాన్ చాలీసాలు చదివితే శని బాధలు తగ్గుతాయి. శనికి ఇష్టమైన ధర్మకార్యాలు శ్రద్ధతో ఆచరించినవారిని అధికంగా బాధించడు. శని శిక్షించాల్సిన సందర్భం వచ్చినా బాధను తక్కువగా చేసి విముక్తి కలిగిస్తాడు.
కార్యాలయంలో బాస్ కోపపడే సందర్భాలు ఉంటాయి. అదే బాస్‌ను ఎప్పుడూ గౌరవంగా చూసుకుంటే తప్పు జరిగినా క్షమిస్తాడు. అదే విధంగా గత జన్మ కర్మలకు అధిపతి శని భగవానుడు. శనిని నిరంతరం ఆరాధిస్తే శిక్షా కాలంలో ఇబ్బందులు తగ్గుతాయి.
కష్టాలు పెట్టేవాడు శని భగవానుడు. కష్టాలు తీర్చేవాడు విష్ణు భగవానుడు. శని నియమాలు పాటిస్తే కష్ట నివారణ జరుగుతుంది.
NOTE: ఈ విషయాలలో పేర్కొన్న అభిప్రాయాలు, ఆచారాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలు, సాంస్కృతిక భావనల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. కేవలం సమాచారం, సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. సంపద, దారిద్ర్యం లేదా వ్యక్తిగత ఫలితాల విషయంలో వీటిని సలహాలుగా లేదా హామీగా పరిగణించకూడదు.
