US Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఓటేసిన బైడన్.. బ్యాలెట్ బాక్సులకు నిప్పు పెట్టిన దుండగులు

ఒరెగాన్ లోని పోర్ట్ లాండ్, వాషింగ్టన్ లోని వాంకోవర్ లో దుండగులు బ్యాలెట్ బాక్స్ లకు నిప్పు పెట్టారు. మండే స్వభావం కలిగిన పదార్థాలను బ్యాలెట్ బాక్సుల కింద అమర్చారని పోలీసులు పేర్కొన్నారు.

US Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఓటేసిన బైడన్.. బ్యాలెట్ బాక్సులకు నిప్పు పెట్టిన దుండగులు

US Election 2024

Updated On : October 29, 2024 / 8:25 AM IST

US Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో వారంరోజులు సమయం మాత్రమే ఉంది. నవంబర్ 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్‌ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పలు సర్వే సంస్థలు తమ సర్వే ఫలితాలను వెల్లడించగా.. ఇద్దరి మధ్య హోరాహోరీ ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. ఇదిలాఉంటే.. ఒరెగాన్ లోని పోర్ట్ లాండ్, వాషింగ్టన్ లోని వాంకోవర్ లో దుండగులు డ్రాప్ బ్యాలెట్ బాక్స్ లకు నిప్పు పెట్టారు. మండే స్వభావం కలిగిన పదార్థాలను బ్యాలెట్ బాక్సుల కింద అమర్చారని పోలీసులు పేర్కొన్నారు.

Also Read: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో 2 వారాల సమయం.. ట్రంప్, కమలా హారిస్‌లో ఎవరు ముందంజలో ఉన్నారు?

ఒరెగాన్ లో సోమవారం తెల్లవారు జామున 3.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) డ్రాప్ బ్యాలెట్ బాక్సు లో అగ్నిప్రమాదం జరిగింది. అయితే, అగ్నిప్రమాదం సమాచారం అందిన వెంటనే అధికారులు స్పందించారని పోర్ట్ ల్యాండ్ పోలీస్ బ్యూరో తెలిపింది. ఎఫ్బీఐ యొక్క సీటెల్ కార్యాలయ ప్రతినిధి స్టీవ్ బెర్ండ్ మాట్లాడుతూ.. ఫెడరల్ అధికారులు ఈ సంఘటనలపై దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. అయితే, అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో కేవలం మూడు బ్యాలెట్ లు మాత్రమే దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే వాషింగ్టన్ లోని వాంకోవర్ ట్రాన్సిట్ సెంటర్ డ్రాప్ బాక్సులను గుర్తు తెలియని వ్యక్తులు దగ్దం చేశారు. ఇక్కడ వందలాది బ్యాలెట్లు ద్వంసం అయ్యాయి. దీంతో శనివారం ఉదయం 11గంటల (స్థానిక కాలమానం ప్రకారం) తరువాత ట్రాన్సిట్ సెంటర్ బ్యాలెట్ బాక్సులో తమ బ్యాలెట్ పేపర్లు వేసిన ఓటర్లు ప్రత్యామ్నాయ బ్యాలెట్ కోసం తమ కార్యాలయంలో సంప్రదించాలని స్థానిక అధికారులు తెలిపారు.

Also Read: US Elections 2024: మరో రెండు వారాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ట్రంప్‌కు షాకిచ్చిన నోబెల్ గ్రహీతలు

ఇదిలాఉంటే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సొంత పట్టణమైన డెలావేర్ లోని విల్మింగ్టన్ లో తన ఇంటికి సమీపంలోని పోలింగ్ కేంద్రంలో క్యూలో నిల్చుని ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.