వుహాన్ లో కరోనాతో ఎంత మంది చనిపోయారో తెలుసా?
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. చైనాలోని వుహాన్ లో తీవ్ర బీభత్సం సృష్టించింది. కరోనా వైరస్ వల్ల 2వేల 535 మంది మృతిచెందినట్లు చైనా అధికారికంగా చెబుతోంది.

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. చైనాలోని వుహాన్ లో తీవ్ర బీభత్సం సృష్టించింది. కరోనా వైరస్ వల్ల 2వేల 535 మంది మృతిచెందినట్లు చైనా అధికారికంగా చెబుతోంది.
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. చైనాలోని వుహాన్ లో తీవ్ర బీభత్సం సృష్టించింది. కరోనా వైరస్ వల్ల 2వేల 535 మంది మృతిచెందినట్లు చైనా అధికారికంగా చెబుతోంది. కానీ ఆ మరణాల రేటుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైరస్ కేంద్ర బిందువైన వుహాన్ నగరం రెండు నెలల లాక్‌డౌన్ తర్వాత మళ్లీ తెరుచుకున్నది. అయితే వైరస్ వల్ల చనిపోయిన వారి చితాభస్మం కోసం కుటుంబసభ్యులు స్మశానవాటికల వద్ద క్యూలైన్లు కడుతున్నారు. దీంతో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడవుతున్నాయి. గతం వారం వుహాన్‌లో సుమారు 5వేల మందికి చితాభస్మాలను అందజేశారు.
తమవారి చితాభస్మం కోసం స్మశానవాటికలకు వెళ్తున్న ప్రజలు
వుహాన్‌లో మొత్తం 8 స్మశానవాటికలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆంక్షలు ఎత్తివేయడంతో వుహాన్‌లో ప్రజలు స్మశానవాటికలకు వెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆరున్నర గంటల పాటు కూడా తమవారి చితాభస్మం కోసం ఎదురుచూడాల్సి వస్తున్నది. ప్రతి రోజూ 3500 చితాభస్మాలను అందజేస్తామని అధికారులు ఇప్పటికే చెప్పారు. ఏప్రిల్ 5 వరకు ఈ ప్రక్రియ ఉంటుందన్నారు. ఒకవేళ ఈ విధానం రోజూ జరిగితే, దాన్ని బట్టి వుహాన్ మృతుల సంఖ్యను అంచనా వేయవచ్చు. చైనాకు చెందిన కైక్సిన్ అనే పత్రిక స్మశానవాటికల్లో ఉన్న చితాభస్మాల ఫోటోలను ప్రచురించింది.
ప్రతి రోజూ ఒక్కొక్క స్మశానవాటికల్లో 220 దహనాలు
మహమ్మారి వ్యాపించిన తర్వాత ప్రతి రోజూ ఒక్కొక్క స్మశానవాటికల్లో 220 దహనాలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. 8 స్మశానవాటికల్లో మొత్తం 84 ఫర్నేస్‌లు ఉన్నాయి. ఈరకంగా 1560 మందిని రోజూ దహనం చేసి ఉంటారని కొందరు అంచనా వేస్తున్నారు. చైనాలో పుట్టి, అమెరికాలో బ్లాగ్ రచయితగా పనిచేస్తున్న జెన్నిఫర్ జెంగ్ తన ట్విట్టర్‌లో కొన్ని భయానక విషయాలను వెల్లడించారు. చితాభస్మాలను అందజేస్తున్న ప్రక్రియను పరిశీలిస్తే, వుహాన్‌లో 59 వేల మంది మరణించినట్లు ఆమె అంచనా వేశారు. చైనా దేశవ్యాప్తంగా ఆ సంఖ్య 97 వేలు ఉంటుందని భావిస్తున్నారు. ఇక వైరస్ పది లక్షల మందికిపైనే సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Also Read | కరోనా ఎఫెక్ట్…పారిశ్రామిక రంగం కోసం మరో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించనున్న కేంద్రం