Stag beetle : చెత్తలో ఉండే ఈ పురుగు బిఎండబ్ల్యూ, ఆడి కార్ల కంటే ఖరీదైనది.. ఎందుకో తెలుసా?

ప్రపంచంలోనే అతి ఖరీదైన కీటకం గురించి తెలుసా? దాని ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు. అది ఎందుకు అంత ధర పలుకుతుందో? చదవండి.

Stag beetle : చెత్తలో ఉండే ఈ పురుగు బిఎండబ్ల్యూ, ఆడి కార్ల కంటే ఖరీదైనది.. ఎందుకో తెలుసా?

Stag beetle

Updated On : December 13, 2023 / 7:11 PM IST

Stag beetle : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం చెత్తలో బతుకుతుంది.. కానీ దాని ఖరీదు బిఎండబ్ల్యూ, ఆడి కార్ల ధరకంటే ఎక్కువ.. ఎందుకు? అంటే చదవండి.

China : మహిళ కంట్లో 60 బ్రతికున్న పురుగులు.. అరుదైన కేసుగా చెబుతున్న వైద్యులు

భూమి మీద ఎన్నో జంతువులు, కీటకాలు ఉంటాయి. అందులో కొన్నిటిని ఆహారంగా తింటారు. కొన్ని ప్రాణానికి ప్రమాదకరమైనవి.. అయితే ఒక కీటకం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. దాని ధర బిఎండబ్ల్యూ, ఆడి కార్ల కంటే ఎక్కువ. చెత్తలో నివసించే ఈ కీటకాన్ని జపనీస్ పెంపకందారుడు రూ.74.25 లక్షలకు విక్రయించాడు. కారణం లేకుండా ఇంత కాస్ట్ పలకదు కదా.

ఖరీదైన ఈ కీటకాన్ని ‘స్టాగ్ బీటిల్’ అంటారు. లుకానిడే కుటుంబానికి చెందిన ఈ కీటకాల్లో ప్రపంచ వ్యాప్తంగా 1200 జాతులు కనిపిస్తాయట. చెత్తలో ఉండే స్టాగ్ బీటిల్స్ కుళ్లిన కలపను ఇష్టపడతాయట. దానినే తింటాయట. పండ్లరసం, చెట్టు రసం కూడా ఆహారంగా తీసుకునే ఈ కీటకం సుమారు 7 సంవత్సరాలు జీవిస్తుందట. అయితే ఇది స్టాగ్ బీటిల్ అని ఎలా గుర్తు పట్టాలి?  అంటే వీటి తలపై 5 అంగుళాల పొడవులో నల్లటి కొమ్ములు ఉంటాయట. ఇవి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తాయి.

Kandi Crop : కందిలో రసంపీల్చే పురుగుల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

చలిని తట్టుకోలేక స్టాగ్ బీటిల్ ఒక్కోసారి చనిపోతాయట. ఈ కీటకం ప్రమాదకర వ్యాధులకు మందును తయారు చేయడంలో ఉపయోగిస్తారట.. అందుకే ఇది ఇంత ధర పలుకుతోంది. అయితే ఈ జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది.