23 Contact Lenses In Woman : షాకింగ్ వీడియో.. మహిళ కంట్లో ఏకంగా 23 కాంటాక్ట్‌ లెన్స్‌..!

ఎవరి కళ్లల్లోనైనా ఒకటికి మించి కాంటాక్ట్‌ లెన్సులు ఉండవు. కానీ, ఓ మహిళ కంట్లో ఏకంగా 23 కాంటాక్ట్‌ లెన్స్‌లు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సదరు మహిళ గత కొన్ని రోజులుగా అద్దాలకు బదులుగా కాంటాక్ట్‌ లెన్స్‌లను ఉపయోగిస్తోంది. అయితే, కొన్ని రోజులుగా ఆమె నిద్రకు ముందు వాటిని తొలగిండం మరిచిపోయి.. ఉదయం మరో కొత్త లెన్స్‌ పెట్టుకునేది.

23 Contact Lenses In Woman : షాకింగ్ వీడియో.. మహిళ కంట్లో ఏకంగా 23 కాంటాక్ట్‌ లెన్స్‌..!

Contact Lense

Updated On : October 14, 2022 / 1:53 PM IST

23 Contact Lenses In Woman : కంటి చూపు మందగించినప్పుడు కళ్లద్దాలు వినియోగిస్తారు. అయితే కళ్లద్దాలకు బదులుగా వాడే కాంటాక్ట్‌ లెన్సులు వాడటం తెలిసిన విషయమే. ఇటీవల వాటి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కంటి సమస్యలు ఉన్నవారు.. అద్దాలతో తమ అందం పాడవుతుందని భావించేవారు కాంటాక్ట్‌ లెన్స్‌లు వాడుతున్నారు. అయితే, కాంటాక్ట్‌ లెన్స్‌లను వాడటం అంత సులువు కాదు.

వాటికోసం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వాటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాదు, వాటిని ఉపయోగించే వాళ్లు కళ్లను రుద్దడం వంటివి చేయకూడదు. ముఖ్యంగా పడుకునేటప్పుడు కచ్చితంగా వాటిని తీసేసి నిద్రపోవాలి. ఎందుకంటే వాటిని తీసివేయకపోతే పొరపాటున కంట్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.

Betel Leaves : రోజుకు రెండు తమలపాకులు, పచ్చకర్పూరంతో కలిపి తీసుకుంటే కంటి సమస్యలు దరిచేరవా?

ఎవరి కళ్లల్లోనైనా ఒకటికి మించి కాంటాక్ట్‌ లెన్సులు ఉండవు. కానీ, ఓ మహిళ కంట్లో ఏకంగా 23 కాంటాక్ట్‌ లెన్స్‌లు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సదరు మహిళ గత కొన్ని రోజులుగా అద్దాలకు బదులుగా కాంటాక్ట్‌ లెన్స్‌లను ఉపయోగిస్తోంది. అయితే, కొన్ని రోజులుగా ఆమె నిద్రకు ముందు వాటిని తొలగిండం మరిచిపోయి.. ఉదయం మరో కొత్త లెన్స్‌ పెట్టుకునేది.

ఇలా వరుసగా 23 రోజులు చేసింది. చివరకు ఆమెకు కంట్లో నొప్పి రావడం మొదలైంది. భరించలేని నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా… ఆమెను పరీక్షించిన వైద్యులు మహిళ కంట్లో ఏమో ఉన్నట్లు గుర్తించారు. సర్జికల్‌ వస్తువు సాయంతో కంట్లో ఉన్నవి తీయగా.. 23 కాంటాక్ట్‌ లెన్స్‌లు బయటపడ్డాయి. ఇది చూసిన వైద్యులు ఆశ్చర్యం పోయారు. దీనికి సంబంధించిన వీడియోను కాలిఫోర్నియా ఐ అసోసియేట్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజిలో పోస్టు చేశారు.

Cornea Implant From Pig Skin : పంది చర్మంతో కార్నియా చికిత్స..20 మందికి కంటిచూపు ప్రసాదించిన ఢిల్లీ ఎయిమ్స్‌ డాక్టర్లు

ఈ ఘటనపై వైద్యురాలు కేథరినా కుర్తీవా మాట్లాడుతూ.. ‘‘ నేను ఎంతో జాగ్రత్తగా ఆ కాంటాక్ట్‌ లెన్స్‌లను బయటకు తీశాను. అవి మొత్తం 23 ఉన్నాయి. వాటిని కంటి నుంచి బయటకు తీయటానికి మంచి సర్జికల్‌ వస్తువును వాడాల్సి వచ్చింది. అవి నెల రోజులు కంటి లోపల ఉండిపోవడంతో ఒకదానికి ఒకటి అతుక్కుని ఉన్నాయి’’ అని వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.