Worlds Ugliest Dog 2023 : ప్రపంచంలోనే అంద వికారమైన శునకంగా గెలుపొందిన ‘స్కూటర్’ అనే డాగ్

ప్రపంచంలో అంద వికారమైన శునకాల కాంపిటేషన్ కాలిఫోర్నియాలో జరిగింది. 'స్కూటర్' అనే డాగ్ ఇందులో విజేతగా నిలిచింది. శునకాల దత్తతపై అవగాహన కల్పించడం కోసమే ఏటా ఈ పోటీలు నిర్వహిస్తారని తెలుస్తోంది.

Worlds Ugliest Dog 2023

Worlds Ugliest Dog 2023 : కాలిఫోర్నియాలో ‘వరల్డ్స్ అగ్లీయెస్ట్ డాగ్  2023’ పోటీలు జరిగాయి. శునకాల దత్తతను ప్రోత్సహించడంలో భాగంగా జరిపే ఈ పోటీల్లో ఈసారి ఏడేళ్ల చైనీస్ క్రెస్టెడ్ డాగ్ ‘స్కూటర్’ విజేతగా నిలిచింది.

US University : యజమానితో పాటు డిప్లొమా డిగ్రీ అందుకున్న శునకం

కాలిఫోర్నియాలో ఐదు దశాబ్దాలుగా ‘వరల్డ్స్ అగ్లీయెస్ట్ డాగ్’ పోటీలు నిర్వహిస్తున్నారు. కుక్కల దత్తతని ప్రోత్సహించడంలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇక 2023 కి గాను నిర్వహించిన పోటీల్లో ‘స్కూటర్’ అనే డాగ్ విజేతగా నిలిచింది. వెంట్రుకలు లేని చైనీస్ క్రెస్టెడ్ డాగ్‌ను ‘సేవింగ్ యానిమల్స్ ఫ్రమ్ యుథనేషియా గ్రూప్’ రక్షించిందట. రెస్క్యూ గ్రూప్‌లోని ఓ వ్యక్తి మొదట్లో దీనిని దత్తత తీసుకున్నాడు. అతని సంరక్షణలో స్కూటర్ 7 సంవత్సరాలు గడిపింది. ఇక అతను దాని సంరక్షణ కొనసాగించలేనని తెలిపినపుడు ఎల్మ్‌క్విస్ట్ అనే మహిళ దానిని దత్తత తీసుకుంది. స్కూటర్ ముందు కాళ్లపై నడుస్తుంది. వెనుక కాళ్లు సరిగా పనిచేయవు. చాలా తొందరగా అలసిపోతుంది. దీని శారీరక వైకల్యం పక్కన పెడితే ఇతర శునకాల మాదిరిగానే అన్ని విషయాల్లో యాక్టివ్‌గా ఉంటుంది.

intelligent dog : ఆ శునకం మహా ముదురు .. చదివింది చేసి చూపిస్తున్న డాగ్ వీడియో వైరల్

కరోనా సమయంలో వాయిదాపడ్డ ఈ పోటీలు ఈ సంవత్సరం విజయవంతంగా నిర్వహించారట. శునకాల దత్తత.. అందంగా, ఆరోగ్యంగా లేని వాటి జీవితాల్లో ప్రేమ, ఆనందం పంచడం కోసం ఈ పోటీలను నిర్వహిస్తారని తెలుస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు