Donald Trump: ఇవానా ట్రంప్ అంత్యక్రియలకు హాజరైన డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ

మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన మొదటి భార్య ఇవానా ట్రంప్ అంత్యక్రియలకు కుటుంబసమేతంగా హాజరయ్యారు. వారి ముగ్గురి పిల్లలతో సహా అక్కడకు వెళ్లి 1980ల నాటి వ్యాపారవేత్తకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో "ఇది చాలా విషాదకరమైన రోజు, కానీఅద్భుతమైన.. అందమైన జీవితాన్ని ఎంజాయ్ చేసే సెలబ్రేషన్ సమయం కూడా" అంటూ పోస్టు పెట్టారు.

Donald Trump: ఇవానా ట్రంప్ అంత్యక్రియలకు హాజరైన డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ

Donald Trump

Updated On : July 21, 2022 / 8:22 AM IST

 

 

Donald Trump: మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన మొదటి భార్య ఇవానా ట్రంప్ అంత్యక్రియలకు కుటుంబసమేతంగా హాజరయ్యారు. వారి ముగ్గురి పిల్లలతో సహా అక్కడకు వెళ్లి 1980ల నాటి వ్యాపారవేత్తకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో “ఇది చాలా విషాదకరమైన రోజు, కానీఅద్భుతమైన.. అందమైన జీవితాన్ని ఎంజాయ్ చేసే సెలబ్రేషన్ సమయం కూడా” అంటూ పోస్టు పెట్టారు.

డొనాల్డ్.. ఇవానా ట్రంప్ లకు ముగ్గురు పిల్లలు. డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్. వారితో పాటుగా మాజీ ప్రెసిడెంట్ కూతురైన టిఫ్ఫనీ ట్రంప్, రెండో భార్య మర్లా మ్యాపుల్స్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇవాంకా ట్రంప్ మామ జారేద్ కుష్ణర్, ఫ్యాషన్ డిజైనర్ డెన్నిస్ బస్సో, ఫ్యామిలీ ఫ్రెండ్స్ పాల్గొన్నారు.

మన్ హటన్ లోని ఇంట్లో 73ఏళ్ల వయస్సులో హఠాత్మరణం చెందినట్లుగా భావిస్తున్నారు. ఒంటిపై కొద్దిపాటి గాయాలు కనిపిస్తున్నట్లు తెలిసింది.

Read Also : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య మృతి

ఇవానా.. డొనాల్డ్ ట్రంప్ 1970లలో కలిశారు. వీరి వివాహ బంధం 1977 నుంచి 1992వరకూ కొనసాగించింది. 1980లో చాలా శక్తిమంతమైన జంటగా ఫ్యామస్ అయ్యారు. ఆమె తన కాళ్ల మీద తానే నిలబడి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. భర్త వ్యాపారాలను కూడా చూసుకునేవారామె. అట్లాంటిక్ సిటీలో కేసినోకు వ్యవహారాలు, న్యూయార్క్ సిటీలో ట్రంప్ టవర్ లాంటి ఎలిమెంట్స్ ను మేనేజ్ చేశారు.