Trump Tariffs : మరో టారిఫ్ బాంబు.. ఈ సారి వాటిపై 100 శాతం సుంకాలు.. భారత్ పై ప్రభావమెంత
Trump Tariffs : ఒకవైపు ఇరాన్ పై యుద్ధంతో బిజీగా ఉన్న ట్రంప్ ప్రపంచ దేశాల మీద మరోసారి టారిఫ్ వార్ ప్రకటించారు. వాటిపై 100 శాతం సుంకాలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
trump imposes 100pc tariffs on imported drugs how indian pharma companies effected
- మరోసారి టారిఫ్ వార్ ప్రకటించిన ట్రంప్
- విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మందులపై సుంకాలు
- ఏకంగా నూరు శాతం సుంకాలు విధింపు
Trump Tariffs : ఒకవైపు ఇరాన్ మీద యుద్ధంతో బిజీగా ఉన్న ట్రంప్.. ఇతర ప్రపంచ దేశాలను సైతం ప్రశాంతంగా వదలడం లేదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టారిఫ్‌ల మోత మోగిస్తున్న ట్రంప్.. తాజాగా మరోసారి టారిఫ్ వార్కి తెరతీశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే.. పేటెంట్ పొందిన మందులపై 100 శాతం పన్ను విధించారు. తాజాగా దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. ఔషధాలు, ఔషధ ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవడం వల్ల అమెరికా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతోందన్న ట్రంప్.. అందుకే వాటిపై నూరు శాతం సుంకాలు విధిస్తున్నట్లు తెలిపారు. ట్రంప్ నిర్ణయం భారతీయ ఫార్మా కంపెనీలపై ఏ విధంగా ఉండనుందంటే..
అయితే ట్రంప్ విధించిన సుంకాల నుంచి కొన్ని కంపెనీలకు మినహాయింపు దక్కనుంది. ఇంతకూ ఆ కంపెనీలు ఏవంటే.. ‘మోస్ట్ ఫేవర్డ్’ కింద ఒప్పందం చేసుకున్న కంపెనీలు. ఏంటీ ఒప్పందం అంటే.. సదరు కంపెనీలు అమెరికాలోనే ఉత్పత్తి కేంద్రాల్ని ఏర్పాటు చేసినా.. లేదా ఏర్పాటు చేస్తామని ఒప్పందం చేసుకున్నా.. ఆ కంపెనీలకు ఈ సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది. వాటి పేటెంట్, ఇతర ఉత్పత్తులపై టారిఫ్ విధింపు ఉండదు. ఒప్పందం చేసుకోని కంపెనీలు మాత్రం సుంకాలు చెల్లించాల్సిందే.. తొలుత 20 శాతం.. తర్వాతి నాలుగేళ్లలో 100 శాతం వరకు టారిఫ్స్ అమలు చేస్తామని వైట్ హౌస్ వెల్లడించింది.
Medicine Prices Rise : యుద్ధం ఎఫెక్ట్.. మందుల ధరలు పెరుగుతున్నాయ్..! ఏ ఔషధం రేటు ఎంత పెరిగిందంటే?
ఈ నూతన సుంకాలను అమలు చేసేందుకు కొంత గడువు ఇచ్చింది. దీనిలో భాగంగా చర్చలు జరిపేందుకు పెద్ద ఫార్మా కంపెనీలకు ముందుగా 120 రోజులు.. మిగతా సంస్థలకు 180 రోజుల గడువు ఇచ్చింది. ఏయే కంపెనీలపై ఈ ప్రభావం పెద్ద మొత్తంలో పడుతుందో స్పష్టత లేదు. ఇప్పటికే కొన్ని కంపెనీలు చర్చలు జరిపి.. డీల్స్పైన సంతకాలు కూడా చేసినట్లు తెలుస్తోంది.
Donald Trump : యుద్ధం ఇప్పట్లో ముగియదు : ట్రంప్
భారత ఫార్మా కంపెనీల పరిస్థితి:
భారత్‌కు చెందిన ఫార్మా కంపెనీలు.. ఎక్కువగా జనరిక్ మందులను అమెరికాకు ఎగుమతి చేస్తుంటాయి. అయితే ఈ మందులపై ప్రస్తుతం పన్ను విధించలేదు. కనుక, భారత ఫార్మా రంగంపై ఈ టారిఫ్‌ల భారం ప్రస్తుతానికి లేనట్లే. అయితే రానున్న రోజుల్లో జనరిక్ మందులను కూడా సమీక్షిస్తామని వైట్ హౌస్ వెల్లడించింది. దీని ప్రకారం భవిష్యత్తులో ఒకవేళ జనరిక్ మందులపై పన్నులు విధిస్తే, భారత కంపెనీలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే బయోకాన్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా వంటి కంపెనీలు జనరిక్ మందులు మాత్రమే కాక.. పేటెంట్ మందులను కూడా అమెరికాలో విక్రయిస్తున్నాయి. కనుక ఆయా కంపెనీలపై ఈ టారిఫ్‌ల ప్రభావం పడే అవకాశం ఉంది.
