Donald Trump : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి తప్పిన ప్రమాదం.. దావోస్‌కు వెళ్తుండగా ఘటన
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రమాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
Donald Trump
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రమాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎలక్ట్రికల్ సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్లు తిరిగి వాషింగ్టన్‌కు విమానాన్ని మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు నిమిత్తం ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో డొనాల్డ్ ట్రంప్ స్విట్టర్లాండ్‌కు బయలుదేరారు. అయితే, విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఎలక్ట్రికల్ సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని తిరిగి వాషింగ్టన్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయితే, దావోస్ పర్యటన కోసం ట్రంప్ మరో ఎయిర్‌ఫోర్స్ విమానంలో వెళ్లనున్నారు.
సాంకేతిక సమస్య నేపథ్యంలో విమానాన్ని వెనక్కి తీసుకురావాలని నిర్ణయించినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివియెట్ తెలిపారు. దేశాధ్యక్షుడి ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో విమానాన్ని వెనక్కి రప్పించినట్లు చెప్పారు. ఎయిర్‌పోర్స్ వన్‌లో భాగంగా దేశాధ్యక్షుడి ప్రయాణాల కోసం గత నాలుగు దశాబ్దాల నుంచి నాలుగు విమానాలను వాడుతున్నారు. బోయింగ్ కంపెనీ ఆ విమానాలను మెయిన్‌టేన్ చేస్తుంది. అయితే, ఇటీవల ఆ విమానాల్లో చాలా మార్పులు చేశారు. మిలిటరీతో టచ్ లో ఉండేందుకు, ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చేందుకు అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థను ఎయిర్ ఫోర్స్ విమానంలో ఏర్పాటు చేశారు.
