Donald Trump Oath Ceremony
Donald Trump First Speech : అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే హడావుడిగా పలు నిర్ణయాలు ప్రకటించారు. ఆయన ఒకదాని తర్వాత ఒకటి నిర్ణయాలు ప్రకటిస్తుంటే సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది. ప్రత్యర్థి డెమొక్రాట్లు కూడా ట్రంప్ నిర్ణయాలలో చాలా వరకు నిలబడి చప్పట్లు కొట్టడం కనిపించింది. అధ్యక్షుడిగా ట్రంప్ సోమవారం (జనవరి 20)న ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా అమెరికాను మెరుగైన స్థితికి తీసుకురావడంతో పాటు ప్రపంచ సమస్యలపై కూడా మాట్లాడారు. వీటిలో అమెరికా దేశీయ విధానాలలో మెరుగుదలలు, ఇతర దేశాలపై పన్ను విధించే విధానం మరియు ఇతర అంశాలు ఉన్నాయి.
Read Also : Donald Trump : అధ్యక్ష బాధ్యతల తర్వాత భారత్‌లో ట్రంప్ పర్యటించే అవకాశం..!
ట్రంప్ దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించగానే డెమోక్రటిక్ నేతలు కూడా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న పెద్ద నిర్ణయంగా భావిస్తున్నారు. మెక్సికో సరిహద్దుల్లో అక్రమ చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇక్కడ సైన్యాన్ని మోహరిస్తారు.
అగ్రరాజ్యంలో స్వర్ణయుగం.. అమెరికా ఈజ్ బ్యాక్ :
అమెరికా స్వర్ణయుగం ప్రారంభమైందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా మళ్లీ గొప్పగా ఉంటుంది. ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత సోషల్ మీడియాలో వైట్ హౌస్ ముఖచిత్రం కూడా మారిపోయింది. అందులో డొనాల్డ్ ట్రంప్ చిత్రం ఉంది. అంతే కాకుండా అమెరికా ఈజ్ బ్యాక్ అని రాశారు.
Donald Trump Speech
డొనాల్డ్ ట్రంప్ తన మొదటి ప్రసంగంలో చైనా పేరును కూడా ప్రస్తావించారు. చైనా ఆక్రమణ నుంచి పనామా కాలువను వెనక్కి తీసుకుంటామన్నారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పిలుస్తామని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దీంతోపాటు మెక్సికో సరిహద్దుల్లో చొరబాట్లను పూర్తిగా నిషేధించనున్నారు. ద్రవ్యోల్బణం తగ్గించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పారు.
ఇకపై అమెరికాలో ఆడ, మగ మాత్రమే :
దేశ శత్రువులను ఎదుర్కొనేందుకు సైన్యానికి మరింత బలం చేకూరుతుందని ట్రంప్ అన్నారు. ఇప్పుడు అమెరికాలో ఆడ, మగ అనే రెండు లింగాలు మాత్రమే ఉంటాయని పెద్ద ప్రకటన చేశాడు. అంటే.. డొనాల్డ్ ట్రంప్ ఎల్‌జీబీటీ కమ్యూనిటీకి పెద్ద దెబ్బ కొట్టారు. ఒక వైపు, (LGBT) ప్రజలు ప్రపంచవ్యాప్తంగా తమ ఉనికి కోసం కోసం పోరాడుతున్నారు. అదే సమయంలో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వారికి ఎలాంటి గుర్తింపు ఇవ్వడానికి నిరాకరించారు. ఇకపై అమెరికా సైన్యం మరే దేశంతోనూ యుద్ధానికి దిగదని ట్రంప్ స్పష్టం చేశారు.
మాజీ అధ్యక్షుడు బైడెన్‌కు గౌరవ వీడ్కోలు :
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు జో బైడెన్, జిల్ బిడెన్ స్వాగతం పలికారు. తన ప్రసంగంలో జో బైడెన్‌పై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల పాలనలో తారాస్థాయికి చేరిన అవినీతిని నిర్మూలిస్తామన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత ట్రంప్ బైడెన్‌కు గౌరవప్రదంగా వీడ్కోలు పలికారు.