Donald Trump : అధ్యక్ష బాధ్యతల తర్వాత భారత్‌లో ట్రంప్‌ పర్యటించే అవకాశం..!

Donald Trump : అమెరికా 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం తర్వాత భారత్‌లో డొనాల్డ్ ట్రంప్ పర్యటించాలని భావిస్తున్నట్టు సమాచారం.

Donald Trump : అధ్యక్ష బాధ్యతల తర్వాత భారత్‌లో ట్రంప్‌ పర్యటించే అవకాశం..!

Donald Trump

Updated On : January 19, 2025 / 7:54 PM IST

Donald Trump : డొనాల్డ్ ట్రంప్ జనవరి 20 (సోమవారం) రోజున 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన భారత్‌లో పర్యటించాలని భావిస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా, బీజింగ్‌లో కూడా అధ్యక్ష హోదాలో తొలిసారిగా చైనాలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి.

బీజింగ్‌తో సంబంధాలను మరింతగా పెంచుకునే ప్రయత్నంలో భాగంగా చైనాకు వెళ్లాలనుకుంటున్నారని మీడియా నివేదిక తెలిపింది. భారత పర్యటన గురించి సలహాదారులతో కూడా ట్రంప్ మాట్లాడినట్లు నివేదికలు తెలిపాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Read Also : Realme P3 5G Leak : రియల్‌మి P3 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..

ప్రథమ మహిళ మెలానియా, కుమారుడు బారన్‌తో కలిసి ప్రత్యేక విమానంలో డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ట్రంప్.. తన ఎన్నికల ప్రచారంలో చైనాపై అదనపు టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించారు. “అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తాను పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చైనాకు వెళ్లాలనుకుంటున్నట్లు సలహాదారులకు చెప్పారు.

సంబంధిత వ్యక్తుల ప్రకారం.. చైనా దిగుమతులపై కోణీయ సుంకాలను విధించే అధ్యక్షుడి హెచ్చరికలతో దెబ్బతిన్న జిన్‌పింగ్‌తో సంబంధాన్ని మరింతగా పెంచుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు” అని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.

మోదీని ఆహ్వానించేందుకు ట్రంప్ పర్యటన :
ట్రంప్ సన్నిహిత వ్యక్తుల ప్రకారం.. భారత్ పర్యటన గురించి సలహాదారులతో కూడా మాట్లాడినట్లు తెలిపారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ క్రిస్మస్ సందర్భంగా వాషింగ్టన్ డీసీని సందర్శించినప్పుడు కూడా ట్రంప్ పర్యటనపై ప్రాథమిక స్థాయి చర్చలు జరిగినట్టు తెలిసింది.

ఆస్ట్రేలియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ నాయకులతో కూడిన క్వాడ్ సమ్మిట్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఈ సందర్శన ఏప్రిల్ ప్రారంభంలో లేదా ఈ సంవత్సరం చివరిలో జరగవచ్చు. ఈ సమయంలో జరిగే వైట్‌హౌస్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్‌ ఆహ్వానించే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు.

చైనా అధ్యక్షుడికి ట్రంప్ ఫోన్ కాల్ :
ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కూడా మాట్లాడారు. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడానికి వైస్ ప్రెసిడెంట్ హాన్ జెంగ్‌ను జి నియమించారు. మొదటిసారిగా ఒక సీనియర్ చైనా అధికారి అమెరికా అధ్యక్ష ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. ప్రారంభోత్సవానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. ట్రంప్ తన ప్రమాణస్వీకారానికి చైని జిన్‌‌పింగ్‌ను ఆహ్వానించారు.

అయితే, చైనా అధ్యక్షుడు ఎప్పుడూ విదేశీ నాయకుల ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు. చర్చల తర్వాత, తాను జిన్ పింగ్‌కు ఫోన్ కాల్ చేశానని ట్రంప్ చెప్పారు. “నేను ఇప్పుడే చైనా ఛైర్మన్ జిన్‌పింగ్‌తో మాట్లాడానని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో రాశారు. “మేం కలిసి చాలా సమస్యలను పరిష్కరించుకుంటాం. వాణిజ్యం, ఫెంటానిల్, టిక్‌టాక్ ఇతర విషయాలపై చర్చించాం. ఇది రెండు దేశాలకు చాలా మంచిది” అని పేర్కొన్నారు.

Read Also : TikTok Ban : అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం.. నిలిచిపోయిన సర్వీసులు.. ట్రంప్ నిర్ణయంపైనే కంపెనీ ఆశలు..!