ఢిల్లీ ఇటు రగులుతోంది, అటు ట్రంప్‌కు ఆతిథ్యమిస్తోంది

ఢిల్లీకి రెండు ముఖాలు: ఆందోళనలు, ఘనమైన ఆతిథ్యాలు.. ఇలాంటి పరిస్థితి ఢిల్లీకి ఎప్పుడూ ఎదురుకాలేదు. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ కోసం వేలాది మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ తయారైంది. 20కిలోమీటర్ల ఈ హైసెక్యూరిటీ జోన్ లో ట్రంప్ కోసం రెడ్ కార్పెట్ వెల్ కమ్ చెబుతున్నారు.
అమెరికా, భారత్ దేశాధినేతలు ఉన్న ఈ ప్రాంతానికి 20కిలోమీటర్ల దూరంలో జఫ్రాబాద్ లో పోలీసులు ఆందోళనకారుల మీద ఉక్కుపాదం మోపారు. CAA అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య గొడవలు. హెడ్ కానిస్టేబుల్ తో సహా ఏడుగురు చనిపోయారు. సోమవారం ఆందోళనలు, బీభత్సం తర్వాత మంగళవారం ఉదయం నుంచి స్మశాన నిశబ్ధం.
సోమవారం ఉదయం నుంచి పెద్దగా ఆందోళన జఫ్రాబాద్ లో కనిపించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం రాత్రంతా రాళ్లదాడులు సాగుతూనే ఉన్నాయని తెలుస్తోంది. తుపాకీ కాల్పుల శబ్ధాలు కూడా వినిపించాయంట. మంగళవారం ఉదయం కూడా Brahampuri, Maujpur, Babarpur ప్రాంతాల్లో ఆందోళన రేగుతూననే ఉంది.
సోమవారం రాత్రి గోకుల్ పురి ప్రాంతంలో టైర్ మార్కెట్ ను అగంతకులు తగలబెట్టారు. మంటలను ఆర్పడానికి 15 ఫైరంజన్ వచ్చాయి.
రెండో రోజుకూడా మెట్రో పింక్ లైన్ లోని ఐదు స్టేషన్ క్లోజ్ చేశారు. Jaffrabad, Maujpur-Babarpur, Gokulpuri, Johri Enclave, Shiv Vihar స్టేషన్ లను తెరవలేదు.
అందుకే వెల్కమ్ మెట్రో స్టేషన్ దగ్గరే మెట్రో ట్రైన్స్ ఆగిపోతున్నాయి. ఈలోగా గోకుల్ పురి ప్రాంతంలో రేగిన అలజడుల్లో గాయపడ్డ డిసిపి అమిత్ శర్మ హాస్పటల్ లో కోలుకొంటున్నారు. ఇప్పటికే ఏడుగురిని ఈ గొడవలు బలితీసుకున్నాయి.
మరోవైపు ప్రెసిడెంట్ ట్రంప్ కు రాష్ట్రపతి భవన్ దగ్గర అపూర్వస్వాగతం లభించింది. త్రివిధ దళాలు సైనిక వందనమిచ్చాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ తో సహా ప్రధాని హాజరైయ్యారు.
ఆ తర్వాత అమెరికా ప్రెసిడింట్ రాజ్ ఘాట్ కెళ్లి మహాత్మగాంధికి నివాళులు అర్పించారు.
ఆ తర్వాత ప్రధాని మోడీ ట్రంప్ తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు సాగించారు. వేదిక హైదరాబాద్ హౌస్. మూడు బిలియన్ డాలర్ల మేర ఆయుధ కొనుగోలు ఒప్పందం కుదిరింది.