ఆయిల్ కంపెనీలపై డ్రోన్ దాడులు : చేసింది మేమే.. హౌతీ రెబల్స్ ప్రకటన
సౌదీ అరామ్ కోలో ఆయిల్ కంపెనీపై దాడులు జరిగాయి. యెమెన్ కు చెందిన హౌతీ రెబల్స్ దాడులకు పాల్పడ్డట్లు ప్రకటించుకున్నాయి.

సౌదీ అరామ్ కోలో ఆయిల్ కంపెనీపై దాడులు జరిగాయి. యెమెన్ కు చెందిన హౌతీ రెబల్స్ దాడులకు పాల్పడ్డట్లు ప్రకటించుకున్నాయి.
సౌదీ అరేబియాలో డ్రోన్ తో బాంబు దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. సౌదీ అరామ్ కోలో ఆయిల్ కంపెనీపై దాడులు జరిగాయి. రెండు చోట్ల చమురు బావులు తగలబడుతున్నాయి. యెమెన్ కు చెందిన హౌతీ రెబల్స్ దాడులకు పాల్పడినట్టు ప్రకటించుకున్నాయి. ఈ ఘటనపై సౌదీ భద్రతా బలగాలు దర్యాప్తు చేస్తున్నాయి. అరామ్ కో ఆయిల్ కంపెనీలో రిలయన్స్ 20 శాతం పెట్టుబడులు పెట్టాయి. అక్కడి నుంచి భారత్ కు చమురు దిగుమతులు అవుతున్నాయి. చమురు సరఫరాలో కొంత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది.
2015, అంతకముందు అల్ ఖైదా ఉగ్రవాద సంస్థలు డ్రోన్లతో ఈ చమురు కంపెనీలపై దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ దృశ్యాలను చూసినట్లైతే భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఆయిల్ ట్యాంకర్లు పేలి మంటలు ఇండస్త్రీ మొత్తం వ్యాపించాయి.
డ్రోన్లతోపాటుగా కొంతమంది ఉగ్రవాదులు తుపాకులతో ఆయిల్ కంపెనీపై దాడులు చేసినట్లు స్థానికులు చెప్పినట్లు ప్రాథమిక దర్యాప్తు వెల్లడించింది. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని సౌదీ అరేబియా మంత్రులు ప్రకటన విడుదల చేశారు.
2006లో కూడా అల్ ఖైదా ఉగ్రవాదులు ఇదే కేంద్రంపైనా ఆత్మహుతి దాడికి ప్రయత్నించి, విఫలమయ్యారు. షేర్ మార్కెట్లు కొంత లాభాల్లో ముగిసిన తరుణంలో చమురు కంపెనీలపై ఉగ్రదాడి జరిగింది. సోమవారం నుంచి స్టార్ట్ అయ్యే స్టాక్ మార్కెట్లను కుదిపేసే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అక్కడున్న ఇండస్ట్రియలిస్టు సెక్యూరిటీ టీమ్ ప్రస్తుతం మంటలను అదుపు చేసే పనిలో ఉన్నారు.
ఇటీవలే యెమెనుకు చెందిన హౌతీ రెబెల్స్ డ్రోన్లతో సౌదీలో దాడులు చేశారు. ఇస్లామిక్ దేశాల్లో ఉగ్రవాదం రోజురోజుకు పెరిగిపోతుంది. అక్కడ వాణిజ్యపరంగా అభివృద్ధిని అడ్డుకునేందుకు చమురు కంపెనీలపై ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని సౌదీ అరేబియా నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి రాలేదు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్నాయి.
ఈ దాడులు చేసింది మేమే అని ఒక మీడియాలో హౌతీ రెబెల్స్ ప్రకటించాయి. దీనిని సౌదీ ప్రభుత్వం, అధికారులు ఇప్పటి వరకు ధృవీకరించలేదు. దీనికి సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు జరిపిన తర్వాతే ఘటనకు బాధ్యులు ఎవరనేది ప్రకటిస్తామని అధికారులు చెబుతున్నారు.
సౌదీ అరేబియాలోని ఇంధన కంపెనీల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్స్, అనుమానితులను అదుపులోకి తీసుకునే చర్యలు ప్రారంభించారు. ఒక పక్క భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు, మరోవైపు చమురు కంపెనీల దగ్గర భద్రతను కట్టుదిట్ట చేశారు. అలాగే ఉగ్రవాదులు ఎక్కడైనా దాడులకు వ్యూహ రచన చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సౌదీ అరేబియా సెక్యూరిటీ అధికారులు భద్రతలను కట్టుదిట్టం చేశారు. ఇంధన కంపెనీలు, సున్నిత ప్రాంతాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు.
వారాంతం కావడంతో ఉదయం పూట ప్రమాదం సంభవించినందు వల్ల ఎక్కువ మంది ఉద్యోగులు లోపల ఉండి ఉండరనేది ప్రాథమిక సమాచారం. ఈ రెండు ఆయిల్ కంపెనీలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారనేది విషయాన్ని ప్రభుత్వ అధికారులు వెల్లడించలేదు. డ్రోన్లకు బాంబులు అటాచ్ చేసి, టైమర్ ద్వారా వాటిని పేల్చినట్లు తెలుస్తోంది. మంటలను అదుపు చేశామని సౌదీ హోంశాఖ తెలిపింది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు.