మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తున్న పిల్లిని శ్రీలంకలో జైలు నుంచి తప్పించుకుంది

గుట్టు చప్పుడు కాకుండా సామాన్లు దోచుకెళ్లడంలో పిల్లులు దిట్ట. ఆహారం సంపాదించడానికి.. ఎంత ఇరుకు సందుల్లో అయినా దూరిపోతాయి. పని కోసం నిద్రాహారాలు మానేసి కష్టపడి పనిచేసే పిల్లులు ప్రపంచాన్ని దోచేసేంత కిలాడీలు అని మరోసారి ప్రూవ్ అయింది. ఈ విషయాలన్నీ పిల్లులు పెంచే వాళ్లకు చెప్పే పనిలో లేదు. శ్రీలంకలో పాపులర్ అయిన ఈ పిల్లి గురించి మీరూ తెలుసుకోండి. స్మగ్లింగ్ చేస్తుందని జైల్లో పెట్టిన పిల్లి.. ఖైదీగా ఉండి తప్పించుకుంది.



డ్రగ్స్, సెల్ ఫోన్ సిమ్ కార్డ్స్ స్మగ్లింగ్ చేస్తుందని పిల్లిని శ్రీలంక ప్రధాన జైలులో ఖైదు చేశారు. జైల్ ఇంటిలిజెన్స్ అధికారులు ఈ విషయాన్ని ఆదివారం గుర్తించగలిగారు. అరుణ్ న్యూస్‌పేపర్‌ జైలు నుంచి పారిపోయినట్లుగా వెల్లడించింది.



ఆ పిల్లి మెడకు 2గ్రాముల హెరాయిన్, 2సిమ్ కార్డులు, ఓ మెమరీ చిప్ ను ప్లాస్టిక్ బ్యాగ్ లో కట్టి స్మగ్లింగ్ చేస్తున్నారు. దీని గురించి జైలు అధికారులు ఎటువంటి కామెంట్ చేయలేదు. కొద్ది వారాలుగా చిన్న ప్యాకెట్లలో డ్రగ్స్, సెల్ ఫోన్స్, ఫోన్ ఛార్జర్స్ గోడల మీద నుంచి విసిరేస్తున్నట్లు జైలు అధికారులు అంటున్నారు.



శ్రీలంకలో ప్రస్తుతం డ్రగ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. యాంటీ నార్కోటిక్స్ డిటెక్టివ్స్ డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయని అనుమానిస్తున్నారు. గత వారం ఇదే నేపథ్యంలో గ్రద్ధ డ్రగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు తెలిసి సీజ్ చేశారు.