Turkey Earthquake: టర్కీలో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదు

మలాట్యా ప్రావిన్స్‌లోని యెసిల్యర్ట్ పట్టణంలో సోమవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది. ఈ భూకంపం వల్ల కూడా పలు భవనాలు నేలమట్టమైనట్లు తెలుస్తోంది. పలు భవనాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు

Turkey Earthquake: టర్కీలో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదు

Updated On : February 27, 2023 / 7:49 PM IST

Turkey Earthquake: టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. మలాట్యా ప్రావిన్స్‌లోని యెసిల్యర్ట్ పట్టణంలో సోమవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది. ఈ భూకంపం వల్ల కూడా పలు భవనాలు నేలమట్టమైనట్లు తెలుస్తోంది.

Sourav Ganguly: రిషబ్ పంత్ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సౌరవ్ గంగూలీ.. పంత్ ఎప్పుడు తిరిగొస్తాడంటే

పలు భవనాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఒక బిల్డింగ్ కూలడంతో, ఆ శిథిలాల కింద తండ్రీ, కూతురు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ శిథిలాల నుంచి వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. యెసిల్యర్ట్ పట్టణంలో అనేక బిల్డింగ్స్ కూలిపోయాయని, ఆ నగర మేయర్ మెహ్మెట్ సినార్ మీడియాకు తెలిపారు. నాలుగు అంతస్థుల బిల్డింగ్ కింద తండ్రీ, కూతురు చిక్కుకున్నట్లు వెల్లడించారు.

Manish Sisodia: సీబీఐ కస్టడీకి మనీష్ సిసోడియా.. ఐదు రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు

వీళ్లు ఇంతకుముందే సంభవించిన భూకంప శిథిలాల్లో తమకు సంబంధించిన వస్తువులు తీసుకోవడానికి వెళ్లారని, అప్పుడే భూకంప ప్రభావంతో బిల్డింగ్ కూలిందని సినార్ వివరించారు. బాధితుల్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 6న కూడా ఇక్కడ 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పుడు బిల్డింగ్స్ కూలిన ఘటనలో పలువురు మరణించారు. ఇప్పటివరకు టర్కీ భూకంపం వల్ల 48,000 మందికిపైగా మరణించినట్లు టర్కీ అధికారులు తెలిపారు. మొత్తం 1,73,000 బిల్డింగులు కూలిపోయాయన్నారు.