వణికిపోతున్న న్యూజిలాండ్: భూ ప్రకంపనలు

  • Published By: veegamteam ,Published On : January 23, 2019 / 10:39 AM IST
వణికిపోతున్న న్యూజిలాండ్: భూ ప్రకంపనలు

Updated On : January 23, 2019 / 10:39 AM IST

న్యూజిలాండ్ లో కామన్ గా మారిపోయిన భూకంపాలు
క్రైస్ట్‌చర్చ్ నగరంలో 2011లో 6.3 తీవ్రత  
150 మంది మృతి..వేలాదిమందికి గాయాలు  
2018 అక్టోబర్‌లో వెల్లింగ్‌టన్‌ లో 6.2 తీవ్రత  
2019లో  ఎల్ఎస్పెరెన్స్ రాక్‌కు ఆగ్నేయంలో 5.1 తీవ్రత 
న్యూజిలాండ్ లో భూ ప్రకంపనలు 

వెల్లింగ్టన్ : భూకంపంతో న్యూజిలాండ్ ప్రజలు వణికిపోతున్నారు. అక్టోబర్‌లో 6.2 తీవ్రతతో చోటు చేసుకున్న భూ ప్రకంపనలు రాజధాని వెల్లింగ్‌టన్‌ను వణికించాయి. ఈ క్రమంలో ఈరోజు ఉదయం (జనవరి 23 ఉదయం) న్యూజిలాండ్‌లో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. ఎల్ఎస్పెరెన్స్ రాక్‌కు ఆగ్నేయంలో 248 కిలోమీటర్ల దూరంలో పది కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రీకృమైనట్టు అమెరికా జియలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం కారణంగా జరిగిన నష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది. 

పసిఫిక్ తీరంలోని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ జోన్‌లో ఉన్న న్యూజిలాండ్‌లో తరచూ భూకంపాలు..అగ్ని పర్వత విస్ఫోటాలు సర్వ సాధారణంగా మారిపోయాయి. ఈ క్రమంలో 2018 అక్టోబర్‌లో 6.2 తీవ్రతతో న్యూజిలాండ్  రాజధాని  వెల్లింగ్‌టన్‌ను  భూ ప్రకంపనలు  వణికించిన విషయం తెలిసిందే. పార్లమెంటును కూడా కొద్ది సేపు వాయిదా వేయాల్సి వచ్చింది. 2011లో 6.3 తీవ్రతతో చోటుచేసుకున్న భూకంపం క్రైస్ట్‌చర్చ్ నగరాన్ని అతలాకుతలం చేసింది. దీనికారణంగా 150 మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మందికి గాయాలయ్యాయి.