Earthquake : పాకిస్థాన్‌లో భూకంపం.. 5.5 తీవ్రతతో భూప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు..
ఈ మధ్య కాలంలో వరుస భూకంపాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.

Earthquake : ఆసియా ఖండంలో మరోసారి భూకంపం వచ్చింది. పాకిస్థాన్‌లో భూమి కంపించింది. పాకిస్తాన్ నేషనల్ సీస్మిక్ మానిటరింగ్ సెంటర్ (NSMC) ప్రకారం శనివారం మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషాలకు పాకిస్తాన్ లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5 గా నమోదైంది. రావల్పిండికి 60 కిలోమీటర్ల దూరంలో భూమికి 12 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. కాగా.. భూకంపంక కారణంగా ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఎటువంటి నివేదికలు లేవు.
పంజాబ్ లోని అట్టోక్, చాకల్, మియాన్ వలీ జిల్లాల్లో భూమి కంపించింది. ఖైబర్ ఫక్తున్ క్వా ప్రావిన్స్ లోని పెషావర్, మర్దాన్, మహమంద్, షాబ్ కాదార్ ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి.
Also Read : దేశంలో హైఅలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాల వార్నింగ్.. ఆ ప్రాంతాల్లో భద్రత పెంచాలని సూచన
ఈ మధ్య కాలంలో వరుస భూకంపాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రాంతంలో భూమి కంపిస్తుందో తెలియని పరిస్థితి. భూకంపాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అపారమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. ఇటీవల థాయ్‌లాండ్, మియన్మార్ ప్రాంతాల్లో భూకంపాలు అల్లకల్లోలం సృష్టించాయి. భారీ భూకంపం రావడంతో చిగురుటాకులా వణికిపోయాయి ఆ రెండు దేశాలు. అక్కడ భారీ విధ్వంసం జరిగింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది.