కరోనా ఎఫెక్ట్ : లండన్‌లో చైనా యువకుడిపై దాడి

  • Published By: madhu ,Published On : March 4, 2020 / 07:42 AM IST
కరోనా ఎఫెక్ట్ : లండన్‌లో చైనా యువకుడిపై దాడి

Updated On : March 4, 2020 / 7:42 AM IST

కరోనా విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చాలా మంది మృత్యువాత పడుతున్నారు. అయితే…లండన్‌లో చదువుతున్న చైనా యువకుడిని కొంతమంది వ్యక్తులు దాడి చేయడం కలకలం రేపుతోంది. గాయాలైన ముఖాన్ని ఆ యువకుడు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. జాత్సాహంకారం దాడిగా అభివర్ణించాడు. 
జోనాథన్ మోక్ అనే చైనా యువకుడు లండన్‌ చదువుకుంటున్నాడు.

ఎంతో బిజీగా ఉండే..Oxford Streetలో కొంతమంది వ్యక్తులు ఫిబ్రవరి 24వ తేదీ 9.15 గంటలకు దాడి చేశారని వెల్లడించాడు. కుడి కంటికి గాయమైన విషయాన్ని అతను తీసుకున్న సెల్ఫీ ఫొటోను షేర్ చేశాడు. ఎడమ కంటి తీవ్రగాయమైనట్లుగా ఉంది. ముఖంపై కూడా పలు గాయాలున్నాయి. తనను కొట్టిన వ్యక్తి పలు వ్యాఖ్యలు చేశాడని వెల్లడించాడు. ‘తన దేశంలో మీ కరోనా వైరస్ అక్కర్లేదు’ అంటూ పిడిగుద్దులు కొట్టారని తెలిపారు.

ముక్కు నుంచి రక్తం వచ్చిందని, ముఖానికి గాయాలయ్యాయన్నాడు. ముఖంలో అంతర్గతంగా గాయాలయ్యాయని వైద్యులు చెప్పారని, శస్త్రచికిత్స అవసరమన్నారని తెలిపారు. తాను గత రెండు సంవత్సరాలుగా లండన్‌లో చదువుకుంటున్నట్లు, తాను ప్రతిసారి జాత్యాహంకార వ్యాఖ్యలకు గురవుతున్నట్లు ఆవేదన వెలిబుచ్చాడు. దీనిపై తాము దర్యాప్తు జరుపుతున్నట్లు లండన్ మెట్రో పాలిటిన్ పోలీసులు వెల్లడించారు. విచారణలో అనుమానితులను గుర్తించడం జరుగుతుందని, అందుబాటులో ఉన్నీ సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తాము సహయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, భరోసా ఇవ్వడానికి హెల్ప్ లైన్ నెంబర్లు కేటాయించడం జరిగిందని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. 

Read More : లోక్‌పాల్ రిజెక్ట్ చేస్తే..వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు