Ebrahim Raisi : ఆఫ్ఘానిస్థాన్‌లో ఎన్నికలు జరపాలి : ఇరాన్ అధ్యక్షుడు
ఆఫ్ఘానిస్థాన్‌లో ఎన్నికలు జరపాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తెలిపారు. దేశ భవిష్యత్తును నిర్ణయించడానికి త్వరగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏర్పా

Ibrahim Raisi
Elections in Afghanistan : ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇరవై ఏళ్ల తర్వాత ఆఫ్ఘానిస్థాన్‌ను హస్త గతం చేసుకున్న తాలిబన్లు అధికారం చేపట్టబోతున్నారు. అయితే ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘానిస్థాన్‌లో ఎన్నికలు జరపాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తెలిపారు. దేశ భవిష్యత్తును నిర్ణయించడానికి త్వరగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. దేశంలో తిరిగి శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇరాన్ ఎప్పుడూ ఆఫ్ఘానిస్తాన్‌లో శాంతి, ప్రశాంతతను కోరుకుంటుందన్నారు. రక్తపాతం, హత్యలు ప్రజల సార్వభౌమత్వాన్ని అంతం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆఫ్ఘానిస్థాన్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి మద్దతిస్తామని ఇబ్రహీం రైసీ ప్రకటించారు. తాలిబన్లు ఆఫ్ఘానిస్థాన్‌ను ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తమ ఆధీనంలోని పంజ్‌షేర్‌ను ఆక్రమించుకోవడానికి తాలిబన్ సేనలు పోరాడుతున్నాయి.
ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటు మళ్లీ వాయిదా పడింది. అంతర్జాతీయ సమాజం కోరుకుంటున్న విధంగా విస్తృత, సమ్మిళిత పాలన యంత్రాంగానికి రూపమివ్వడంలో తాలిబన్లకు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటును వాయిదా వేస్తున్నట్టు తాలిబన్ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ వెల్లడించారు. కొత్త ప్రభుత్వం, కేబినెట్ సభ్యుల వివరాలను వచ్చేవారం ప్రకటిస్తామని తెలిపారు.