Elephant Play Drum : వాయించటం నీకే కాదు ..నాకూ వచ్చు.. డ్రమ్ము వాయించిన గజరాజు

వాయించటం నీకే కాదు ..నాకూ వచ్చు అన్నట్లుగా ఓ భారీ ఏనుగు డ్రమ్ము వాయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Elephant Play Drum : వాయించటం నీకే కాదు ..నాకూ వచ్చు.. డ్రమ్ము వాయించిన గజరాజు

Elephant paly drum

Updated On : November 26, 2022 / 4:37 PM IST

Elephant Play Drum : భారీగా ఉండే ఏనుగులు భలే వింతగా ప్రవర్తిస్తుంటాయి ఒకోసారి. మనుషుల్ని అనుకరిస్తుంటాయి కూడా. ఫన్నీ ఫన్నీ పనులు చేస్తుంటాయి. ఒక భారీ ఏనుగు చేసిన పనికి నెట్టింట నవ్వులు కురుస్తున్నాయి. ఇక ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. డ్రమ్ము వాయించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఒక డ్రమ్ ఆర్టిస్ట్ తన పాటను ప్లే చేస్తూ కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి ఒక ఏనుగు వచ్చింది. అతను డ్రమ్ము వాయిస్తుంటే దీక్షగా చూసింది. చాలా శ్రద్ధగా గమనించింది. అతను డ్రమ్ము వాయించాక దాన్ని కాస్త దగ్గరకు లాక్కుని దాని తొండంతో వాయించింది. ఏనుగు డ్రమ్ము వాయించి తీరు..దాని లుక్ చూస్తుంటే వాయించటం నీకే కాదు నాక్కూడా వచ్చు అన్నట్లుగా ఉంది. డ్రమ్ ఆర్టిస్ట్ వాయించటం చూసిన ఆ ఏనుగు కంచెలోంచి తొండాన్ని ముందుక చాచింది. అతడు డ్రమ్స్ ను వాయిస్తుండగా ఆ ఏనుగు కూడా డ్రమ్స్ వాయించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు వేలల్లో వ్యూస్ వచ్చాయి. మరి మీరు కూడా ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.