Elon Musk: మస్క్‌కు వ్యతిరేకంగా మిలియన్ల ఓట్లు.. ఇంకెప్పుడు తప్పుకుంటావంటూ మండిపడుతున్న నెటిజెన్లు

Twitter Users Question Elon Musk Silence After Millions Vote For His Removal
Elon Musk: ‘ట్విట్టర్ సీఈవో పదవి నుంచి తప్పుకోవాలా?’ స్వయంగా ఎలాన్ మస్క్ పెట్టిన పోల్‌లో యూజర్లు గట్టి షాక్ ఇచ్చారు. సగానికి పైగా యూజర్లు ‘అవును.. దిగిపో’ అంటూ తీర్పు చెప్పారు. ఇది గడిచి ఒకరోజు అవుతున్నప్పటికీ మస్క్ మాత్రం దీనిపై స్పందించలేదు. ట్విట్టర్ బాస్‌గా తప్పుకోబోతున్నారా లేదంటే కొనసాగబోతున్నారా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పడం లేదు. మస్క్ ఇలా మౌనంగా ఉండడంపై ట్విట్టర్ యూజర్లు మండిపడుతున్నారు. ‘మస్క్ ఇంకెప్పుడు దిగిపోతావ్’ అంటూ విరుచుకుపడుతున్నారు.
Messi Instagram: ఫిఫా వరల్డ్ కప్ విజయంతో మైదానం బయట మెస్సీ మరో రికార్డు.. రొనాల్డో తరువాత మెస్సీనే..
‘ట్విట్టర్ బాస్‌గా దిగిపోవాలా?’ అంటూ సోమవారం మస్క్ ఒక పోల్ ట్వీట్ చేశారు. ఇందులో ‘యస్’, ‘నో’ అని రెండు ఆప్షన్లు ఇచ్చారు. కాగా, నెటిజెన్లు మాత్రం ‘యెస్’ అనేదానిపైవే మొగ్గు చూపారు. ఈ పోల్‌కు మొత్తంగా 1.75 కోట్ల ఓట్లు పడ్డాయి. అందులో 57.5 శాతం మంది ట్విట్టర్ బాస్‌గా మస్క్ అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇది గడిచి ఒకరోజు అవుతున్నా.. మస్క్ దీనిపై స్పందించకుండా మౌనంగా ఉన్నారు. గతంలో ఎప్పుడూ మస్క్ ఇలా మౌనం వహించలేదు. ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్దరణపై నెటిజెన్ల అభిప్రాయం తీసుకున్నాకే నిర్ణయం తీసుకున్నారు. వాస్తానికి నెటిజెన్ల ఆలోచనలకు అనుగుణంగా మస్క్ కొన్ని నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. గతంలో అన్ని మస్క్కకు అనుకూలంగా వచ్చాయి. బహుశా ఇప్పుడు కూడా ఇలాంటి ఆలోచనతోనే ట్వీట్ పోల్ నిర్వహించి, ప్రతికూల తీర్పు రావడంతో మౌనం వహిస్తున్నారని విమర్శకులు అంటున్నారు.
కొత్త నిర్ణయాలు, సంచలన ప్రకటనలతో మస్క్ తరుచూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ట్విట్టర్ స్వాధీనం చేసుకున్న రోజే సంస్థలోని ప్రధాన ఉద్యోగుల తొలగింపు నిర్ణయం నాటి నుంచి ఈ పర్వం కొనసాగుతోంది. మస్క్ నిర్ణయాలతో సంస్థ నష్టాల్లోకి కూరుకుపోతోందనే వార్తలు సైతం గుప్పుమంటున్నాయి. అయితే మస్క్ మాత్రం ట్విట్టర్ ఎంగేజ్మెంట్ పెరుగుతోందని చెప్తున్నారు. ఆ మధ్య బ్లూ టిక్ వివాదం సైతం చాలా వివాదాస్పదమైంది.