Messi Instagram: ఫిఫా వరల్డ్ కప్ విజయంతో మైదానం బయట మెస్సీ మరో రికార్డు.. రొనాల్డో తరువాత మెస్సీనే..

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో విజయం తర్వాత లియోనెల్ మెస్సీ మైదానం బయట మరో మైలురాయిని చేరుకున్నాడు. మెస్సీ తన ఆన్-ఫీల్డ్ ప్రత్యర్థి క్రిస్టియానో ​​రొనాల్డో తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో 400 మిలియన్ల మంది ఫాలోవర్లను చేరుకున్న రెండవ వ్యక్తిగా నిలిచాడు.

Messi Instagram: ఫిఫా వరల్డ్ కప్ విజయంతో మైదానం బయట మెస్సీ మరో రికార్డు.. రొనాల్డో తరువాత మెస్సీనే..

Lionel Messi

Messi Instagram: గ్రౌండ్‌లోకి దిగాడంటే ప్రత్యర్థులకు చుక్కలు చూపించే ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ. ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డోతో సమానంగా ఆటతీరును కనబర్చకలిగే మెస్సీకి అభిమానుల ఫాలోయింగ్ ఎక్కువే. ఇటీవల ఖతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో ఫ్రాన్స్ జట్టుపై విజయం సాధించి కప్ గెలుచుకోవటంతో లియోనెల్ మెస్సీ పేరు మరింత ప్రాచుర్యం పొందింది. దీంతో మైదానంలో రికార్డులకు తోడు సోషల్ మీడియాలోనూ మెస్సి రికార్డు సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తుల్లో రెండో స్థానంకు మెస్సి దూసుకెళ్లాడు.

Lionel Messi : లియోనల్ మెస్సీ వరల్డ్ గ్రేటెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఎదిగిన వెనుకున్న కారణాలు..

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ లో తన చిరస్మరణీయ విజయం తర్వాత మెస్సికి అభిమానుల ఫాలోయింగ్ సైతం భారీగా పెరిగింది. ఇన్ స్టాగ్రామ్ లో మెస్సి 401 మిలియన్ల మంది ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఫిఫా ప్రపంచ కప్‌కు ముందు మెస్సి ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 376 మిలియన్లు ఉండేది. ప్రపంచ కప్ ప్రారంభమైన నాటి నుంచి నెల రోజుల్లోనే 25 మిలియన్ల మంది మెస్సి ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ గా చేరిపోయారు. దీంతో ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక పాలోవర్స్ కలిగిన వారిలో రెండో స్థానంలో మెస్సి నిలిచాడు.

Lionel Messi

Lionel Messi

మొదటి స్థానంలో ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఉన్నారు. ప్రస్తుతం రొనాల్డో 519 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో ఎవరూ అందుకోలేని స్థాయిలోకి దూసుకెళ్లాడు. 500 మిలియన్లు ఫాలోవర్స్ కు చేరుకున్న మొదటి వ్యక్తి రొనాల్డో. మెస్సి మరో 100 మిలియన్ల మంది ఫాలోవర్స్ ను సంపాదిస్తే ఆ స్థానంలో రెండో వ్యక్తిగా చేరిపోతాడు.