Canada: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ఇండియాతో విబేధాలే కారణమా?

ఎలాన్ మస్క్ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న కెనడియన్ ఫెడరల్ ఎన్నికల్లో ట్రూడో ..

Canada: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ఇండియాతో విబేధాలే కారణమా?

Elon Musk Justin Trudeau

Updated On : November 8, 2024 / 9:48 AM IST

Elon Musk: టెస్లా సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న కెనడియన్ ఫెడరల్ ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతాడని మస్క్ జోస్యం చెప్పాడు. ట్రూడోను వదిలించుకోవడానికి కెనడాకు సాయం చేయండి అంటూ ‘ఎక్స్’లో ఎలాన్ మస్క్ ను ఓ యూజర్ కోరాడు. దీనికి స్పందించిన మస్క్.. జస్టిస్ ట్రూడో రాబోయే ఎన్నికల్లో ఓడిపోతాడు అంటూ బదులిచ్చాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను గెలిపించడంలో కీలక భూమిక పోషించిన మస్క్ నుంచి ఈ విధమైన స్పందన రావడంతో కెనడాలో లిబరల్ పార్టీ గట్టెక్కడం కష్టమేనని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. జస్టిన్ ట్రూడో ఓడిపోతాడని ప్రచారం జరుగుతుండటానికి బలమైన కారణాల్లో భారత్ తో విబేధాలు పెట్టుకోవడం కూడా ఒకటని నెటిజన్లు పేర్కొంటున్నారు.

Also Read: ట్రంప్ వచ్చాడు.. యుద్ధాలు ఆపేస్తాడా? అసలు యుద్ధాలు ఆపడం ఆయనకు సాధ్యమేనా?

2013 నుంచి లిబరల్ పార్టీకి జస్టిన్ ట్రూడో నాయకత్వం వహిస్తున్నాడు. అయితే, ఆయన వచ్చే ఏడాది ఎన్నికలను ఎదుర్కోనున్నాడు. ఈ ఎన్నికల్లో ట్రూడో లిబరల్ పార్టీ ఇతర ప్రధాన పార్టీలతో పోటీ పడుతుంది. ఇందులో పియర్ పోయిలీవ్రే నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ, జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీలు ఉన్నాయి. కెనడా పార్లమెంట్ లో 338 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. ట్రూడో లిబరల్ పార్టీకి 153 మంది సభ్యులు ఉన్నారు. మిత్రపక్షాల మద్దతుతో ఇన్నాళ్లు ట్రూడో ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చాడు. ఈసారి ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతాడని పలు సర్వేలు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. దీనికి కారణం.. కెనడాలో తీవ్రవాదం, హింస సంస్కృతి పెరిగిపోవడంతోపాటు.. భారత్ పై ట్రూడో తీవ్రమైన ఆరోపణలు చేయడం, ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంకూడా ఒక కారణం కాబోతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Also Read: PM Modi – Jupally Rameshwar Rao : ప్రధాని మోదీని కలిసిన మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు, రామురావు

భారత్ పట్ల జస్టిన్ ట్రూడో తీరును సొంత పార్టీలోని ఎంపీలుసైతం వ్యతిరేకిస్తున్నారు. ట్రూడో వెంటనే ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఇటీవల నిజ్జర్ హత్య కేసులో భారత్ పై ట్రూడో తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో కెనడాలో భారత దౌత్యవేత్తలను భారత్ వెనక్కి రప్పించగా.. ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్ సహా ఆరుగురు దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇటీవల కెనడాలో ఖలిస్తానీ మద్దతు దారులు బ్రాంప్టన్ లో ఉన్న హిందూ దేవాలయానికి వచ్చిన భక్తులపై కర్రలతో దాడులకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే, ఈ దాడిని జస్టిన్ ట్రూడో ఖడించినప్పటికీ.. ట్రూడో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబికుతోంది.

 

Musk Tweet