Elon Musk: యుక్రెయిన్ కు ఇంటర్నెట్ సదుపాయం అందించిన ఎలాన్ మస్క్

యుక్రెయిన్ ఉప ప్రధాని మైఖైలో ఫెడోరోవ్..చేసిన విజ్ఞప్తి మేరకు తన స్టార్ లింక్ ప్రాజెక్ట్ ద్వారా యుక్రెయిన్ లో ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాడు ఎలాన్ మస్క్.

Elon Musk

Elon Musk: రష్యా – యుక్రెయిన్ల మధ్య యుద్ధం నాలుగో రోజుకు చేరుకుంది. యుక్రెయిన్ ను ఆక్రమించాలన్న రష్యా కుతంత్రాన్ని యుక్రెయిన్ తిప్పికొడుతోంది. యుక్రెయిన్ నుంచి ఊహించని రీతిలో ప్రతిఘటన ఎదుర్కొంటున్న రష్యా..యుక్రెయిన్ లోని టెలీకమ్యూనికేషన్ వ్యవస్థను ఇతర సాంకేతిక వ్యవస్థలను నాశనం చేసింది. దీంతో శత్రువుల కదలికలపై సమాచారం ఇచ్చిపుచ్చుకునే అవకాశం లేక యుక్రెయిన్ సైన్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఈక్రమంలో.. తమ దేశంలో ఇంటర్నెట్ సేవలు అందించాలంటూ యుక్రెయిన్ ఉప ప్రధాని మైఖైలో ఫెడోరోవ్..టెక్ బిలియనీర్ ఎలోన్ మస్క్ కు విజ్ఞప్తి చేశాడు. దీంతో తన స్టార్ లింక్ ప్రాజెక్ట్ ద్వారా యుక్రెయిన్ లో ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాడు ఎలాన్ మస్క్.

Also read; Russian Airstrikes : యుక్రెయిన్‌పై రష్యా ఎయిర్‌స్ట్రైక్స్‌.. కీవ్‌ సమీపంలోని పెట్రోలియం నిల్వ కేంద్రాలపై దాడులు

“రష్యా దాడులను ఎదుర్కొనేందుకు యుక్రెయిన్ లో శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్‌లను అందించాలని యుక్రెయిన్ ఉప ప్రధాని మైఖైలో ఫెడోరోవ్ చేసిన విజ్ఞప్తి మేరకు, తన కంపెనీ SpaceX యొక్క స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఉక్రెయిన్‌లో యాక్టివేట్ చేయబడిందని ఎలాన్ మస్క్ తెలిపారు. అంతక ముందు యుక్రెయిన్ ఉప ప్రధాని మైఖైలో ఫెడోరోవ్ ట్విట్టర్లో స్పందిస్తూ “మీరు అంగారక గ్రహానికి రాకెట్లు పంపే ఏర్పాట్లు చేస్తున్నప్పుడు — రష్యా.. ఉక్రెయిన్‌ను ఆక్రమించడానికి ప్రయత్నిస్తుంది! మీ రాకెట్లు అంతరిక్షం నుండి విజయవంతంగా ల్యాండ్ అవుతున్నప్పుడు — రష్యన్ రాకెట్లు ఉక్రేనియన్ పౌరులపై దాడి చేస్తాయి! ఉక్రెయిన్‌కు స్టార్‌లింక్ అందించమని మేము మిమ్మల్ని కోరుతున్నాము” అంటూ ఎలాన్ మస్క్ ను విజ్ఞప్తి చేశారు.

Also read: NATO : యుక్రెయిన్‌కు నాటో దేశాలు ఆయుధ సాయం

ఫెడోరోవ్ ట్వీట్ చేసిన 10 గంటల తర్వాత మస్క్ ప్రతిస్పందించాడు. “స్టార్‌లింక్ సేవలు ఇప్పుడు ఉక్రెయిన్‌లో యాక్టివ్‌గా ఉన్నాయని రానున్న రోజుల్లో మరిన్ని టెర్మినల్స్ కూడా అనుసంధానిస్తామని మస్క్ పేర్కొన్నారు. ఇక యుక్రెయిన్ కు ఇంటర్నెట్ సేవలు అందించే విషయమై త్వరితగతిన నిర్ణయం తీసుకున్న ఎలాన్ మస్క్ కు, మరియు అందుకు సహాయం చేసిన అమెరికాలోని యుక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవాకు ఫెడోరోవ్ ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో ఎలాన్ మస్క్ నిర్ణయం పై ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతో శక్తివంతమైన స్టార్ లింక్ వ్యవస్థ నుంచి సైబర్ దాడులు చేయాలంటే రష్యాకు సాధ్యపడని పని.