Erol Musk : మస్క్ మామకు 13వ సంతానం..? మంచి తండ్రే కాడు.. టెస్లా బాస్ సీక్రెట్స్ బయటపెట్టిన తండ్రి ఎర్రోల్ మస్క్..!
Erol Musk : బిలియనీర్, టెస్లా బాస్ ఎలోన్ మస్క్‌పై తండ్రి ఎరోల్ మస్క్ విమర్శలు గుప్పించాడు. పిల్లల్ని పెంచడం చేతకాదని కుమారుడు మస్క్‌ను పాడ్‌కాస్ట్‌లో విమర్శించాడు. ఎక్కువగా నానీలపైనే ఆధారపడతాడని అన్నారు.

Elon Musk's father hits out at parenting
Elon Musk Father Erol Musk : ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన టెస్లా బాస్, స్పేస్‌ఎక్స్ యజమాని ఎలోన్ మస్క్ ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. మస్క్ తన పిల్లల గురించి కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆయన తండ్రి ఎర్రోల్ మస్క్ చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
ఎలోన్ మస్క్ మంచి తండ్రి కాదని ఆయన పేర్కొన్నారు. ఒక పాడ్‌కాస్ట్‌లో ఎర్రోల్ మస్క్ మాట్లాడుతూ.. మస్క్ ఒక చెడ్డ తండ్రి అని, అతడికి తన పిల్లలను పెంచడం చేతకాదని, ఎప్పుడూ ఆ పిల్లలను నానీల సంరక్షణలో వదిలివేస్తాడని చెప్పాడు.
జాషువా రూబిన్‌తో మాట్లాడుతూ మస్క్ తన పిల్లలకు దూరంగా ఉన్నాడని ఎర్రోల్ ఆరోపించాడు. పిల్లలను చూసుకోవడానికి ఇతర కేర్ టేకర్లపై ఆధారపడతారు. ఎలన్ మొదటి బిడ్డ గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. మస్క్ తన పిల్లలలో ఒకరు 10 నెలల వయసులో చనిపోయారని, ఆ సమయంలో ఒక నానీ సంరక్షణలో ఉన్నాడని అసలు విషయాన్ని తండ్రి ఎర్రోల్ బయటపెట్టాడు.
View this post on Instagram
ఎర్రోల్ మస్క్ ఇంకా ఏమన్నారంటే? :
“ఎలోన్ మంచి తండ్రి అని మీరు అనుకుంటున్నారా?” అని తన వైడ్ అవేక్ పాడ్‌కాస్ట్‌లో జాషువా రూబిన్‌ను అడిగారు. దానికి ఎర్రోల్ ఇలా సమాధానమిచ్చారు. “లేదు, అతను మంచి తండ్రి కాలేదు.” అంటూ బదులిచ్చారు.
అప్పటి భార్య జస్టిన్ విల్సన్‌తో మస్క్ మొదటి బిడ్డ నెవాడా అలెగ్జాండర్‌ను చనిపోవడాన్ని ఎర్రోల్ ప్రస్తావించాడు. “ఆ శిశువును నానీలు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దురదృష్టవశాత్తు, వారి పర్యవేక్షణలో ఉండగానే మరణించారు. నేను ఇలా చెప్పడం ఎలోన్ వింటే.. ఆతనికి కోపంగా ఉండవచ్చు. కానీ ఇది నా దృక్పథం. ఇది ఆమోదయోగ్యం కాదని నేను భావిస్తున్నాను” అని ఎర్రోల్ చెప్పుకొచ్చారు.
One thing about Errol Musk is – he will talk. He resents his child even though he himself is evil too pic.twitter.com/L7hIQDpgo1
— Carrot Baskin, PhD (@Misandryna) February 14, 2025
“వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది. చాలా మంది నానీలు ఉన్నారు. ఆ తర్వాత అతనికి అదే స్త్రీతో మరో ఐదుగురు పిల్లలు పుట్టారు. ఐదుగురు కొడుకులు, ఒక్కొక్కరు తమ సొంత నానీలతో పెరిగారు. నేను చెప్పేది మీకు అర్థమైందా?” అని ఎర్రోల్ అన్నారు. మస్క్ తన పిల్లలతో నిజంగా సమయం గడపలేదా? రూబిన్ అడిగిన ప్రశ్నకు ఎర్రోల్ వెంటనే లేదు అని ఇలా సమాధానమిచ్చారు.
మస్క్ 13వ సంతానం? :
ఎలోన్‌తో తనకు ఒక బిడ్డ ఉందని రచయిత్రి ఆష్లే సెయింట్ క్లైర్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఎర్రోల్ మస్క్ పిల్లల పెంపకంపై కామెంట్స్ చేశారు. సెయింట్ క్లైర్ ఐదు నెలల క్రితమే టెస్లా బాస్ బిడ్డను కలిగి ఉన్నానని పేర్కొన్నారు. “ఐదు నెలల క్రితం, నేను ఒక కొత్త బిడ్డను ప్రపంచంలోకి స్వాగతించాను.
Read Also : Ranveer Allahbadia : రణవీర్ అల్లాబాడియా ఎక్కడ? ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరార్.. గాలిస్తున్న ముంబై పోలీసులు..!
మస్క్ తండ్రి అని ఆమె తన పోస్ట్‌కి లాటిన్ భాషలో “అలియా లాక్టా ఎస్ట్” (ది డై ఈజ్ కాస్ట్)తో క్యాప్షన్ ఇచ్చింది. “మా పిల్లల గోప్యత, భద్రతను కాపాడటానికి నేను ఇంతకు ముందు దీన్ని వెల్లడించలేదు. కానీ, ఇటీవలి రోజుల్లో మా బిడ్డ సురక్షితమైన వాతావరణంలో పెరగడానికి నేను భావిస్తున్నాను. అందువల్ల, మీడియా మా పిల్లల గోప్యతను గౌరవించాలని నేను కోరుతున్నాను” అని ఆమె పేర్కొన్నారు.
మస్క్ మామకు ఎంత మంది పిల్లలు :
సెయింట్ క్లెయిర్ వాదన నిజమైతే.. మస్క్ 13వ సంతానం అవుతుంది. మస్క్ తన మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఎలోన్ మస్క్ 3 వేర్వేరు రిలేషన్లతో మొత్తం 12 మంది పిల్లలకు తండ్రి. అతని మొదటి సంతానం కెనడియన్ రచయిత్రి జస్టిన్ విల్సన్‌తో పుట్టింది.
ఈ బిడ్డ కూడా బాల్యంలోనే చనిపోయింది. ఆ తరువాత, ఆ దంపతులకు మరో ఐదుగురు పిల్లలు పుట్టారు. ఆ తరువాత, మస్క్ సంగీతకారుడు గ్రిమ్స్‌తో మరో ముగ్గురు పిల్లలను కన్నారు. ఆ తర్వాత అతనికి న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ గిల్లిస్‌తో మరో ముగ్గురు పిల్లలు పుట్టారు.