Russia Ukraine: రష్యా విమానాలను నిషేధించిన 13 దేశాలు, అదే బాటలో ఈయూ?

ఇప్పటికే 13 దేశాలు రష్యా విమానాలపై నిషేధం విధించగా..ఈయూ కూడా నిషేధం విదిస్తే.. యూరోప్ గగనతలంపై రష్యాను పూర్తిగా బహిష్కరించినట్లే

Russia Ukraine: రష్యా విమానాలను నిషేధించిన 13 దేశాలు, అదే బాటలో ఈయూ?

Flights

Updated On : February 27, 2022 / 7:26 PM IST

Russia Ukraine: యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించడంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పసికూన యుక్రెయిన్ పై దండయాత్ర చేసి రష్యా ఏం సాదిస్తుందని ఆయా దేశాధినేతలు రష్యాపై మండిపడుతున్నారు. ఇప్పటికే యుక్రెయిన్ లోని ప్రధాన నగరాలను రష్యా ఆక్రమించుకుని విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో.. యుద్ధాన్ని ఆపాలంటూ రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యా వెనక్కు తగ్గని పక్షంలో ఆంక్షలు కఠినతరం చేసే దిశగా యూరోపియన్ యూనియన్ సిద్దమైనట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా రష్యా విమానాలపై నిషేధం విధించేందుకు ఈయూ చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

Also read: Russia Ukraine War : యుక్రెయిన్ న్యాయపోరాటం.. రష్యా దాడులపై అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్

ఇప్పటికే 13 దేశాలు రష్యా విమానాలపై నిషేధం విధించగా..ఈయూ కూడా నిషేధం విదిస్తే.. యూరోప్ గగనతలంపై రష్యాను పూర్తిగా బహిష్కరించినట్లే. అయితే రష్యా విమానాలపై నిషేధం విధించే అంశంపై ఈయూ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా..ఫిన్లాండ్, బెల్జియం దేశాలు ఇప్పటికే రష్యా విమానాలపై నిషేధం విధించినట్లు తెలిపాయి. యునైటెడ్ కింగ్‌డమ్, ఐర్లాండ్, ఫిన్లాండ్, బెల్జియం, లాట్వియా, ఎస్టోనియా, లిథువేనియా, పోలాండ్, బల్గేరియా, చెక్ రిపబ్లిక్, మోల్డోవా, రొమేనియా, స్లోవేనియా దేశాలు రష్యా విమానాలపై నిషేధం విధించాయి. అదే సమయంలో రష్యా కూడా ఆ దేశాల విమానాలపై నిషేధం విధించింది. యుద్ధాన్ని విడనాడితే రష్యాపై ఆంక్షలు ఎత్తివేస్తామని ఆయా దేశాలు ప్రకటించాయి.

Also read: Russia Ukraine War : రష్యాతో చర్చలకు సిద్ధమే, కానీ అక్కడ కాదు – జెలెన్ స్కీ ట్విస్ట్