Russia Ukraine War : యుక్రెయిన్ న్యాయపోరాటం.. రష్యా దాడులపై అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్

జరుగుతున్న దారుణాలకు రష్యాను బాధ్యురాలిని చేయాలని ఐసీజేని కోరారు. రష్యా తక్షణమే సైనిక చర్యలను నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Russia Ukraine War : యుక్రెయిన్ న్యాయపోరాటం.. రష్యా దాడులపై అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్

International Court Of Justice

Russia Ukraine War : యుక్రెయిన్‌, రష్యా మధ్య భీకర పోరు నడుస్తోంది. నాలుగో రోజూ(ఫిబ్రవరి 27) యుక్రెయిన్‌పై బాంబులు, మిస్సైళ్లతో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. రాజధాని నగరం కీవ్‌లోకి ప్రవేశించేందుకు రష్యా సైన్యం యత్నిస్తోంది. యుక్రెయిన్‌ గ్యాస్‌, చమురు నిక్షేపాలు టార్గెట్‌ గా రష్యా సేనలు దాడులు చేస్తున్నాయి. కార్కివ్‌లోని గ్యాస్‌ పైప్‌లైన్‌ను రష్యా బలగాలు పేల్చేశాయి. కాగా, యుక్రెయిన్ సైనికులు తగ్గేదేలే అన‍్నట్టుగా తమ పోరాట పటిమను చూపిస్తున్నారు. శక్తివంచన లేకుండా రష్యా దళాలను తిప్పికొడుతున్నారు.

Ukraine Takes Russia To International Court Of Justice Over Invasion

Ukraine Takes Russia To International Court Of Justice Over Invasion

రష్యా దురాక్రమణ యత్నాలను ధీటుగా తిప్పికొడుతున్న యుక్రెయిన్… మరోవైపు ఈ అంశంలో న్యాయపోరాటం చేయాలని నిశ్చయించింది. రష్యా దాడులపై అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)ను ఆశ్రయించింది. రష్యా తీవ్ర దుందుడుకు చర్యలతో తమ దేశంపై దాడి చేసి మారణహోమానికి పాల్పడుతోందని, సైనిక చర్య పేరిట దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ ఆరోపించారు.

Russia Ukraine war: సైనికుల ప్రాణాలు గాల్లో వదిలేసిన రష్యా, మెడికల్ ఎమర్జెన్సీ విధింపు

జరుగుతున్న దారుణాలకు రష్యాను బాధ్యురాలిని చేయాలని ఐసీజేని కోరారు. రష్యా తక్షణమే సైనిక చర్యలను నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా, తమ పిటిషన్ పై వచ్చే వారం విచారణ జరుగుతుందని జెలెన్ స్కీ ఆశించారు. ట్విట్టర్‌ ద్వారా ఆయనీ విషయాన్ని తెలిపారు.

Ukraine Takes Russia To International Court Of Justice Over Invasion

Ukraine Takes Russia To International Court Of Justice Over Invasion

యుక్రెయిన్‌తో రష్యా యుద్ధం ఆదివారం నాటికి నాలుగో రోజుకు చేరింది. రష్యా దళాలు యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌ దిశగా దూసుకెళ్తున్నాయి. తాజాగా యుక్రెయిన్‌ రెండో పెద్ద నగరమైన ఖార్కీవ్‌కు రష్యా దళాలు చేరాయి. అయితే యుక్రెయిన్‌ ఆర్మీ కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. రష్యా సైనిక కాన్వాయ్‌ను నాశనం చేసినట్లు యుక్రెయిన్‌ ఆర్మీ తెలిపింది. తమ పోరాట ధాటిని రష్యా సైన్యం తట్టుకోలేకపోతున్నదని గర్వంగా వెల్లడించింది.

Russia Ukraine War : తగ్గేదే లే…అంటున్న యుక్రెయిన్ ప్రజలు

యుక్రెయిన్ విష‌యంలో ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ మొండిపట్టుతో ముందుకెళ్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. ఏమైనా స‌రే.. యుక్రెయిన్‌ను త‌న దారిలోకి తెచ్చుకోవాల్సిందేన‌ని భీష్మించుకు కూర్చున్నారు పుతిన్‌. ఏం జ‌రిగినా… ఏం చేసినా… యుక్రెయిన్‌ను దారిలోకి తెచ్చుకోవాల‌న్న ఏకైక ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ ప‌నిలో ఎంత న‌ష్టం సంభ‌వించినా స‌రే… ముందుకెళ్ల‌డానికే పుతిన్ మొగ్గుచూపుతున్నార‌న్న‌ది నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. ర‌ష్యాకు సంబంధించిన సైనికులు మ‌ర‌ణించినా స‌రే… ముందుకే వెళ్లాని డిసైడ్ అయ్యార‌ట‌. సుమారు 50వేల మంది రష్యా సైనికులు మ‌ర‌ణించే ఛాన్స్ ఉంద‌ని అధికారులు లెక్క‌లు కట్టినా… పుతిన్ మాత్రం వెనక్కితగ్గలేదట.