AccountsBan:ఆస్ట్రాజెనెకా,ఫైజర్ టీకాలువేసుకుంటే చింపాంజీలుగా మారిపోతారని ప్రచారం
ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకాలు వేసుకుంటే చింపాంజీలుగా మారిపోతారని ఫేస్ బుక్ వేదికగా జరుగుతున్న ఇటువంటి తప్పుడు ప్రచారాలపై యాజమాన్యం చర్యలు తీసుకుంది.అటువంటి ప్రచారాలు చేసే 300 ఖాతాలను బ్యాన్ చేసింది.

Facebook Bans 300 Russian Accounts
Facebook bans 300 Russian Accounts : కరోనాను నియంత్రించటానికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. మహమ్మారికి బారిన పడకుండా జనాలు కూడా టీకాలు వేయించుకుంటున్నారు. అటువంటి వ్యాక్సిన్లలో ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకాలు కూడా ఉన్నాయి. ఈక్రమంలో ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకాలు వేసుకుంటే చింపాంజీలుగా మారిపోతారని సోషల్ మీడియా వేదికగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు.ఫేస్ బుక్ వేదికగా జరుగుతున్న ఇటువంటి తప్పుడు ప్రచారాలపై యాజమాన్యం చర్యలు తీసుకుంది.
ఇండియా, లాటిన్ అమెరికా ఖాతాదారులే లక్ష్యంగా ఇటువంటి ప్రచారం చేస్తున్న దాదాపు 300 ల ఖాతాలపై బ్యాన్ విధించింది. దీంట్లో భాగంగా 65 ఫేస్‌బుక్, 243 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై వేటు పడింది. నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదని ఫేస్‌బుక్ హెచ్చరించింది.ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకాలపై ప్రచారం చేసిన సదరు ఖాతాదారులు ‘చింపాంజీ జన్యువుల ఆధారంగా ఆస్ట్రాజెనెకా టీకా తయారైందని..పరీక్షల్లో అది తీవ్ర దుష్ప్రభావాన్ని చూపించిందని ఆ టీకా వేసుకుంటే చింపాంజీలుగా మారిపోరని ఫేస్‌బుక్ వేదికగా జరుగుతున్న ప్రచారంపై ఫేస్‌బుక్ తీవ్రంగా స్పందించింది.
ఫైజర్ వ్యాక్సిన్ విషయంలో కూడా దాదాపు ఇటువంటి ప్రచారమే జరిగింది. ఈ పోస్టులకు 2020 డిసెంబరు 14 నుంచి 21వ తేదీ మధ్య దాదాపు 10 వేలమంది హ్యాష్‌ట్యాగ్ జత చేశారు. మీమ్స్, కామెంట్లు కూడా వచ్చాయి. 2021 మేలో కూడా ఇటువంటి ఫేస్‌బుక్‌లో కొన్ని పోస్టులు కనిపించాయి. వాటితోపాటు ఆస్ట్రాజెనెకాకు చెందిన కొన్ని డాక్యుమెంట్లు కూడా కనిపించాయి.ఈ దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందించిన ఫేస్‌బుక్ 300 ఖాతాలపై బ్యాన్ విధించింది.
ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారంతా రష్యన్లేనని.. ఇండియా, లాటిన్ అమెరికా ఖాతాదారులే లక్ష్యంగా ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నట్టు గుర్తించింది. నిబంధనలను ఉల్లంఘించిన 65 ఫేస్‌బుక్ ఖాతాలు, 243 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను తొలగించామరి ఫేస్‌బుక్ తెలిపింది.