అక్కడ వారానికి 4రోజులు.. 6గంటలే పని: ప్రధాని రూల్

అక్కడ వారానికి 4రోజులు.. 6గంటలే పని: ప్రధాని రూల్

Updated On : January 7, 2020 / 12:12 AM IST

ఫిన్‌లాండ్ కొత్త ప్రధానమంత్రి సన్నా మారిన్ నూతన ఆలోచనను ప్రజల ముందుంచింది. ప్రపంచంలోనే అతి చిన్న వయస్సులో మహిళా ప్రధాని అయిన మారిన్.. వర్కింగ్ లైఫ్ లో మార్పులు తీసుకురావాలనుకుంటున్నారట. ఈ 34ఏళ్ల మారిన్ ఫిన్‌లాండ్‌లో ఐదు పార్టీల కూటమితో ప్రధాని అయ్యారు. 

‘ప్రజలు కుటుంబంతో ఎక్కువ గడపడానికే ఇష్టపడతారనుకుంటున్నాను. వారిని ప్రేమించే వారి కోసం, హాబీలు పూర్తి చేసుకోవడం కోసం, జీవితాల్లోని వేరే విషయాల కోసం, సంప్రదాయాలు వంటి అంశాలు పూర్తి చేసుకోవడానికి వినియోగిస్తారనుకుంటున్నా. వర్కింగ్ లైఫ్ లో మా తరువాతి ఆలోచన ఇదే’ అని ఆమె చెప్పారు. 

ప్రస్తుతం ఫిన్‌లాండ్‌లో వారానికి ఐదురోజులు.. 8గంటలు పని కొనసాగుతుంది. 1996 నుంచి అక్కడి కార్మికులకు మూడు గంటలు అంతకంటే తక్కువ సమయం పనిచేసే హక్కు ఉంది. అది 2015లో ఆరు గంటలు పని సమయంగా, వారానికి ఐదు రోజులుగా మార్చారు. దీంతో ప్రజలు సంతోషంగా, ధనికంగా కనిపించినట్లుగా గుర్తించారు.