Fire Accident : ఇరాక్ సోరన్ యూనివర్సిటీలో ఘోర అగ్నిప్రమాదం.. 14 మంది మృతి

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని కుర్దిష్ ఛానెల్ నివేదించింది. భవనంలోని మూడు, నాల్గవ అంతస్తుల్లో మంటలు అదుపులోకి వచ్చినట్లు ఐఎన్ఏ తెలిపింది.

Fire Accident : ఇరాక్ సోరన్ యూనివర్సిటీలో ఘోర అగ్నిప్రమాదం.. 14 మంది మృతి

fire accident

Soran University Fire Accident : ఇరాక్ లోని సోరన్ యూనివర్సిటీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సోరన్ యూనివర్సిటీ హాస్టల్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఇరాక్‌లోని ఉత్తర కుర్దిస్థాన్ ప్రాంతంలోని యూనివర్సిటీ హాస్టల్ లో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 14 మంది మృతి చెందారని స్థానిక అధికారులు తెలిపారు. స్థానిక కుర్దిష్ టెలివిజన్ ఛానల్ రుడావ్ భవనం ముందు పని చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది ఫుటేజీని ప్రసారం చేసింది. ఇందులో అకడమిక్ సిబ్బంది, సోరన్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఉన్నారు.

Boat Fire Accident In Sea : కాకినాడ జిల్లా భైరవపాలెం సముద్రంలో ఫిషింగ్ బోట్‌లో అగ్నిప్రమాదం.. రంగంలోకి కోస్టు గార్డ్ సిబ్బంది.. వీడియోలు వైరల్

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని కుర్దిష్ ఛానెల్ నివేదించింది. 14 మంది మరణించారని స్థానిక ఆరోగ్య అధికారులు పేర్కొన్నట్లు రాష్ట్ర వార్తా సంస్థ ఐఎన్ఏ తెలిపింది.

భవనంలోని మూడు, నాల్గవ అంతస్తుల్లో మంటలు అదుపులోకి వచ్చినట్లు ఐఎన్ఏ తెలిపింది. స్వయంప్రతిపత్తి కలిగిన కుర్దిస్థాన్ ప్రాంత ప్రధాన మంత్రి మస్రోర్ బర్జానీ మంటలు చెలరేగడానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు చేయాలని ఆదేశించారు.