Sri Lanka :కిలో పచ్చిమిర్చి రూ.710, కిలో ఆలూ రూ. 200

కిలో పచ్చిమిర్చి రూ.710, బీన్స్ రూ.320, క్యారెట్ రూ.200, పచ్చి అరటి రూ.120, బెండ రూ.200, టమాట రూ.200లు ధరలు ఇలా ఉంటే ఎలా బతికేదంటున్నారు లంకవాసులు.

Sri Lanka Food and drink prices skyrocket : చైనా నుంచి అప్పు తీసుకున్నందుకు శ్రీలంక ఇప్పుడు నానా తిప్పలు పడుతోంది.అప్పు కట్టటానికి పడే పాట్లు అన్నీ ఇన్నీకావు. ఈ ప్రభావం శ్రీలంకలో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగటానికి ఓ కారణంగా మారింది. ద్రవ్యోల్బణం ప్రజల జీవనాన్ని కష్టాలపాలు చేసింది. లంకలో ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు దిగజారుతోంది. ఈ ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై అత్యంత భారంగా మారింది. దీంతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ఆహార పదార్థాలు కొనాలంటేనే హడలిపోతున్న పరిస్థితి ఉంది. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

Read more : UK : దేశంలోనే రికార్డు సృష్టించిన శిశువు..అమ్మకు 17 ఏళ్లే

దీని కింద ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ప్రజలకు ఆహారం, పానీయాలు అందించేందుకు సైన్యానికి అధికారం కల్పించారు. దీంట్లో భాగంగా కిలో పచ్చిమిర్చి రూ.710, బీన్స్ రూ.320, క్యారెట్ రూ.200, పచ్చి అరటి రూ.120, బెండ రూ.200, టమాట రూ.200కు అమ్ముతున్నారు.

దారుణంగా పడిపోతున్న ద్రవ్యోల్బణంతో శ్రీలంకలో ఆహార పదార్థాల ధరలు నెల రోజుల్లోనే 15 శాతం పెరిగిపోయాయి. దేశంలో పలురకాల వస్తువులు అస్సలు అందుబాటులోనే లేకుండాపోయారు. పలు వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ ప్రభావం సామాన్య మానవుడిపై తీవ్రంగా కనిపిస్తోంది. ఇక రోజువారీ కూలీల పరిస్థితి..ఆటో డ్రైవర్లు వంటివారి పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది.

Read more : Antique Pieces: రూ.40 కోట్ల విలువైన హిందూ దేవతల పురాతన విగ్రహాలు స్వాధీనం

కడుపునిండా తినటానికి కూడా ఆలోచించుకోవాల్సి వస్తోందని సామాన్యులు వాపోతున్నారు. శ్రీలంక ఇటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోవడం వెనుక కరోనా ఓ కారణమైతే..అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యయం పెరగడం, పన్ను తగ్గింపులు వంటి అంశాలు కూడా ఈ పరిస్థితికి కారణమంటున్నారు.

చైనా అప్పుల ఊబిలో శ్రీలంక చిక్కుకుపోయింది. శ్రీలంక చాలా ఎక్కువ వడ్డీకి చైనా నుంచి అప్పు తీసుకుంది. దాన్ని తీర్చటానికి నానా తంటాలు పడుతోంది. ఆ అప్పుల కుప్పలే శ్రీలంకకు పెను భారంగా మారాయి. అలా తీసుకున్న అప్పుకు సంబంధించి శ్రీలంక ఈ ఏడాది చైనాకు 1.5 నుంచి 2 బిలియన్ డాలర్లు తిరిగి కట్టాల్సి ఉంది. తీసుకున్న రుణాన్ని రీషెడ్యూల్ చేయాలని..తమకు ఆర్థికంగా సహాయం చేయాలని శ్రీలంక చైనాను కోరుతోంది.

 

ట్రెండింగ్ వార్తలు