Hungarian : మాజీ పోర్న్ స్టార్ అరెస్టు, కొడుకును హత్య చేసిందా ?
కటాలిన్ ఎర్జ్ బెట్ బ్రాడాక్స్ మహిళ మాజీ పోర్న్ స్టార్. ఓ సూపర్ మార్కెట్ లో తీవ్రంగా గాయపడిన ఉన్న తన కొడుకు అలెక్స్ ను కాపాడాలని కేకలు వేసింది.

Porn
Former Hungarian Porn Star : కన్నబిడ్డను హత్య చేసిందనే ఆరోపణలతో మాజీ పోర్న్ స్టార్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. తన మీద కోపంతోనే…కొడుకును చంపి ఉండవచ్చునని నార్బార్ట్ ఆరోపించాడు. నార్బర్డ్ ఆమె మాజీ భర్త. ఇతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పర్సులో కత్తి లభించడంతో తల్లే హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read More : Kajal Aggarwal : ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ కమింగ్ సూన్?
కటాలిన్ ఎర్జ్ బెట్ బ్రాడాక్స్ మహిళ మాజీ పోర్న్ స్టార్. ఓ సూపర్ మార్కెట్ లో తీవ్రంగా గాయపడిన ఉన్న తన కొడుకు అలెక్స్ ను కాపాడాలని కేకలు వేసింది. ఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు..ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అప్పటికే బాలుడు చనిపోయి ఉన్నాడు. ఈ మార్కెట్ కు సమీపంలో ఉన్న ఓ భవనంలో అలెక్స్ టీ షర్టు లభించింది. అలెక్స్ మృతదేహంపై 9 గాయాలున్నట్లు గుర్తించారు. బాలుడిని తల్లి కటాలిన్ హత్య చేసినట్లు ఆమె మాజీ భర్త…నార్బర్ట్ ఆరోపిస్తూ..పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read More : MS Dhoni: ‘ఎంఎస్ ధోనీ ఆర్డర్ పెడుతుంటే అయిపోయిందని వస్తుంది’
దర్యాప్తు జరిపిన పోలీసులు ఆమె పర్సులో కత్తి లభించడంతో…అదుపులోకి తీసుకున్నారు. కటాలిన్ తన నుంచి విడాకులు తీసుకుని..అలెక్స్ తో ఇటలీలో ఉంటోందని నార్బర్ట్ తెలిపారు. విడిపోయిన అనంతరం అలెక్స్ పెంపకంపై న్యాయపోరాటం చేస్తున్నట్లు, తన మీద ఉన్న కోపంతోనే…అలెక్స్ ను చంప ఉండవచ్చునని నార్బర్ట్ తెలిపారు. అయితే..ఈ ఆరోపణలను కటాలిన్ ఖండిస్తున్నారు.