MS Dhoni: ‘ఎంఎస్ ధోనీ ఆర్డర్ పెడుతుంటే అయిపోయిందని వస్తుంది’

నేను ఎంఎస్ ధోనీని ఇన్‌స్టామార్ట్ నుంచి ఆర్డర్ పెడదామని ప్రయత్నిస్తున్నా. కానీ, దురదృష్టవశాత్తు అయిపోయిందని పదేపదే అదే మెసేజ్ వస్తుంది.

MS Dhoni: ‘ఎంఎస్ ధోనీ ఆర్డర్ పెడుతుంటే అయిపోయిందని వస్తుంది’

Ms Dhoni

MS Dhoni: ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్.. స్విగ్గీ నెటిజన్‌కు భళే రిప్లై ఇచ్చింది. సోషల్ మీడియాలో తమ సందేహాలను, సమస్యలను పంపించే తుంటరి కస్టమర్లకు అదే రేంజ్ లో రెస్పాన్స్ ఇస్తుంటాయి జొమాటో, స్విగ్గీలు. ఇటీవల ఈ ఫుడ్ ప్లాట్ ఫాంలపై కొత్త ఫీచర్లు వచ్చాయంటూ మిల్లీనియల్స్, జెన్ ఎక్స్, జెన్ జెడ్ ఫీచర్లను అనౌన్స్ చేశాయి.

సోషల్ మీడియాలో రెస్పాన్స్ ఇవ్వాలంటే చాలా మ్యాన్ పవర్ అవసరం. కానీ, వాటన్నిటికీ రిప్లై ఇచ్చేందుకు రొబోట్లను అరేంజ్ చేస్తున్నాయి. ప్రత్యేకమైన సందేహాలకు రిప్లై ఇవ్వాల్సినప్పుడు మాత్రమే ఇలా కౌంటర్ వేసేందుకు ఏజెంట్లు ఇన్వాల్వ్ అవుతుంటారు. రీసెంట్ గా ఓ నెటిజన్ ట్వీట్ కు అలాంటి కౌంటరే ఒకటి వచ్చింది.

నేను ఎంఎస్ ధోనీని ఇన్‌స్టామార్ట్ నుంచి ఆర్డర్ పెడదామని ప్రయత్నిస్తున్నా. కానీ, దురదృష్టవశాత్తు అయిపోయిందని పదేపదే అదే మెసేజ్ వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడేదెలా అని పోస్టు చేశాడు.

………………………………………….. : ‘మా’ ఎలక్షన్స్ లో ఓటుకి నోటు.. ఓటుకి పదివేలు

దానికి రిప్లై ఇచ్చిన స్విగ్గీ కస్టమర్ కేర్.. ‘దురదృష్టవశాత్తు వాళ్లు ఎంఎస్ ధోనీ లాంటి లెజెండ్స్ ను తయారుచేయలేరు’ అని అదే స్టైల్ లో రిప్లై ఇచ్చింది. స్విగ్గీ కస్టమర్ క్వైరీ హ్యాండిల్ నుంచి వచ్చిన ట్వీట్ ను కస్టమర్ వింత డౌట్ కలిసి వైరల్ అవుతున్నాయి.