MAA Elections : ‘మా’ ఎలక్షన్స్ లో ఓటుకి నోటు.. ఓటుకి పదివేలు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో విజయం సాధించేందుకు వేరే ప్యానెల్ వాళ్ళు ఓటుకు రూ.10వేలు ఇస్తున్నారని నాగబాబు ఆరోపించారు.

MAA Elections : ‘మా’ ఎలక్షన్స్ లో ఓటుకి నోటు.. ఓటుకి పదివేలు

Maa

MAA Elections :  ‘మా’ ఎలక్షన్స్ రోజూ రోజుకి మరింత హీట్ ఎక్కుతున్నాయి. అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు జరగనున్నాయి. ప్రతి సారి కంటే ఈ సారి ఎక్కువ వివాదాలు తలెత్తుతున్నాయి. ఎలక్షన్స్ కి ఇంకా మూడు రోజులు మాత్రమే ఉండటంతో రెండు ప్యానళ్లు వాళ్ళ ప్రచార హోరుని పెంచాయి. ఇప్పటికే విమర్శలు, వ్యక్తిగత దూషణలు, ఫిర్యాదుల వరకు వెళ్లారు. ఇంకా ఈ ఎలక్షన్స్ అయ్యేలోపు ఎంత దూరం వెళ్తారో.

తాజాగా నిన్న ప్రకాష్ రాజ్ ప్యానెల్ పెట్టిన ప్రెస్ మీట్ లో నాగబాబు విష్ణు ప్యానెల్ పై, విష్ణుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో విజయం సాధించేందుకు వేరే ప్యానెల్ వాళ్ళు ఓటుకు రూ.10వేలు ఇస్తున్నారని నాగబాబు ఆరోపించారు. ‘మా’ ఎన్నికల్లో సభ్యులకు డబ్బు ఆశ చూపిస్తున్నారు. ఒక్కో ఓటరుకు రూ.10 వేలు ఇస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత మరికొంత నగదు ఇస్తామని చెబుతురన్నారట. ‘మా’ అసోసియేషన్ మసకబారబోతుంది. సభ్యుల ప్రతిష్టను దిగజార్చడానికి కొందరు కుట్ర చేస్తున్నారు అని నాగబాబు వ్యాఖ్యానించారు. మా అసోసియేషన్ సభ్యులు ఎలాంటి ప్రలోభాలకు గురికావొద్దు అని తెలిపారు.

…………………… Samantha : పెళ్లి రోజూ భావోద్వేగమైన పోస్ట్ పెట్టిన సమంత..

ఇక విష్ణు ప్యానెల్ వాళ్ళు ప్రకాష్ రాజ్ ని విమర్శిస్తున్నారు, నాన్ లోకల్ అంటున్నారు అనే వాటికి ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ.. ప్రకాశ్‌రాజ్‌ భారతీయ నటుడని, ఆయన తెలుగువాడు కాదని విమర్శించే వాళ్లు సినిమాల కోసం ఎలా కావాలంటారని ప్రశ్నించారు. ప్రకాశ్‌రాజ్‌ కూరలో ఉప్పులాంటి వారు. ఆయన చిన్న సినిమా వాళ్లకు, పెద్ద సినిమా వాళ్లకూ కావాలి. నటుడిగా ఉత్తమ స్థాయిలో ప్రకాశ్‌రాజ్‌ను అందరూ ఒప్పుకోవాల్సిందే ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ పోటీ చేస్తారని అస్సలు ఊహించలేదు. అసోసియేషన్ కోసం కొన్ని సినిమాలు కూడా వదులుకుంటానని ఆయన నాతో చెప్పారు. ఒక్క సినిమాకు కోటి రూపాయలు తీసుకునే నటుడు ప్రకాశ్‌రాజ్. అన్ని డబ్బులు వదులకుని కూడా ‘మా’ కోసం పనిచేయడానికి వచ్చారు. ప్రకాశ్‌రాజ్ తెలుగువాడు కాదని విమర్శించే వాళ్లు తమ సినిమాల కోసం మాత్రం కావాలని పాకులాడుతారు. కోట శ్రీనివాసరావు, బాబుమోహన్‌లాంటివాళ్లు ప్రకాశ్‌రాజ్ ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. కోట శ్రీనివాసరావు ఇతర భాషల్లో నటించలేదా? ‘మా’ అసోసియేషన్‌కు సేవ చేస్తానని వస్తానంటే కించపరుస్తారా అని తీవ్రంగా స్పందించారు. ప్రకాశ్‌రాజ్‌ను గెలిపించేందుకు నూటికి నూరుశాతం శ్రమిస్తాం అని నాగబాబు అన్నారు.