Super skipping Video..నలుగురూ ఒకేసారి డిఫరెంట్ స్టంట్స్ తో స్కిప్పింగ్

  • Published By: nagamani ,Published On : September 29, 2020 / 03:08 PM IST
Super skipping  Video..నలుగురూ ఒకేసారి డిఫరెంట్ స్టంట్స్ తో స్కిప్పింగ్

Updated On : September 29, 2020 / 4:00 PM IST

‘Pyramid Wheel Free Style Jump Rope’ Super skipping : అంతర్జాతీయ రోప్ అథ్లేట్ జోరావర్ సింగ్ తన ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి చేసిన స్కిప్పింగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. స్కిప్పింగ్ చేస్తూ వారు చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉన్నాయి.


ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా నలుగురు వ్యక్తులు ఒకేసారి రెండు రోప్ లతో విన్యాసాలు చేసి ఔరా అనిపించుకున్నారు. మొదట ఇద్దరు, మరో ఇద్దరి భుజాలపై కూర్చొని రెండు రోప్ లతో స్కిప్పింగ్ చేశారు. తరువాత పైన కూర్చున్న ఇద్దరూ కిందకు దిగి డ్యాన్స్ వేసినట్లుగా చేసిన స్కిప్పింగ్ సూపర్బ్ గా ఉన్నాయంటూ నెటిజన్స్ తెగ మెచ్చేసుకుంటున్నారు.


దీని జోరావర్ సింగ్ మాట్లాడుతూ.. ఆరు ఏళ్లు ప్రాక్టీస్ తరువాత ఈ ‘పిరమిడ్ వీల్ ఫ్రీ స్టైల్ జంప్ రోప్’ చేయడం సాధ్యమైందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి జంప్ రోప్ అథ్లేట్ జోరావర్ సింగ్ తన ఫ్రెండ్స్ తో కలిసి పలురకాలుగా చేసిన స్టంట్స్ తో చేసిన స్కిప్పింగ్ నోరెళ్లబెట్టాల్సిందే. ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండీ..ఫిదా అవుతారు..