France Elections: అధికారంలోకి వస్తే తలకప్పులు ధరించే ముస్లింలకు జరిమానా విధిస్తా: ఫ్రెంచ్ అధ్యక్ష అభ్యర్థి మెరైన్ లే పెన
కార్లలో సీటు బెల్టులు ధరించని వారికి విధించే జరిమానా విధంగానే హిజాబ్ ధరించే వారికీ పోలీసులు జరిమానా విధిస్తారని ఆమె పేర్కొన్నారు

France
France Elections: తాము అధికారంలోకి వస్తే..ఫ్రాన్స్ దేశంలో హిజాబ్, బురఖా, తలకప్పు ధరించే ముస్లింలకు జరిమానా విధిస్తామని ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి మెరైన్ లే పెన్ అన్నారు. మరో మూడు రోజుల్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ముందు..ఓటర్లను ఆకర్శించేందుకు నేతలు హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. ఈనేపధ్యంలో నేషనల్ ర్యాలీ పార్టీ(గతంలో నేషనల్ ఫ్రంట్) తరుపున మెరైన్ లే పెన్ అధ్యక్ష బరిలో నిలిచారు. ఆదివారం జరగనున్న మొదటి రౌండ్ ఓటింగ్‌కు ముందు ప్రస్తుత ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రోన్ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. అయితే స్వల్ప తేడాలో ఉన్న లే పెన్..ఏప్రిల్ 24 రన్-ఆఫ్‌లో గెలిచే నిజమైన అవకాశం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.
Aslso read:Russia Ukraine war: రష్యా కౄరత్వానికి హద్దులు లేకుండా పోయింది: యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
కాగా బురఖా, తలకప్పులు ధరించే ముస్లింలపై జరిమానా విధించే పద్ధతిపై మెరైన్ లే పెన్ వివరణ కూడా ఇచ్చారు. కార్లలో సీటు బెల్టులు ధరించని వారికి విధించే జరిమానా విధంగానే హిజాబ్ ధరించే వారికీ పోలీసులు జరిమానా విధిస్తారని ఆమె పేర్కొన్నారు. సీటు బెల్టు పెట్టుకోకపోవడం చట్ట విరుద్ధమైన రీతిలో హిజాబ్ ధరించే ప్రజలకు జరిమానా విధిస్తారు. ఈ చర్యను పోలీసులు చాలా సమర్థంగా అమలు చేయగలరని నాకు అనిపిస్తోంది” అని శుక్రవారం నాడు నిర్వహించిన ఒక సమావేశంలో మెరైన్ లే పెన్ అన్నారు. పశ్చిమ ఐరోపాలో అతిపెద్ద ముస్లిం జనాభాకు నిలయంగా ఉన్న ఫ్రాన్సు దేశంలో ఇటీవలి కాలంలో ముస్లింల పై వివక్ష ఎక్కువ అయింది.
Also read:Covaxin Vaccine: కొవాగ్జిన్ టీకాకు జపాన్ గుర్తింపు: భారత్ – జపాన్ మధ్య ప్రయాణాలు సులభతరం
అయితే తాను ప్రతిపాదించిన చట్టాలు వివక్షాపూరితంగా మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉండి, రాజ్యాంగపరమైన సవాళ్లను అధిగమించేందుకు ప్రజాభిప్రాయ సేకరణకు కూడా వెళ్తానని లీ పెన్ చెప్పారు. ఇమ్మిగ్రేషన్ ను తీవ్రంగా వ్యతిరేకించే నేషనల్ ర్యాలీ పార్టీ..ఈ ఏడాది తమ విధానాలను పక్కనబెట్టి..దేశంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోయే విధంగా ప్రచారాలు నిర్వహించింది. కరోనా నియంత్రణలో మాక్రోన్ ప్రభుత్వ వైఫల్యం, దేశంలో ఆరోగ్య వ్యవస్థ పై భారం, యుక్రెయిన్ సంక్షోభం వంటి పలు అంశాలు ప్రజల్లో అధికార పార్టీ పై వ్యతిరేకత తీసుకురాగా, నేషనల్ ర్యాలీ పార్టీకి అది అనుకూలంగా మారి ఓటర్లకు దగ్గర చేసింది. దీంతో ఈ ఏడాది ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది.
Also read:Rahul Gandhi: ఆర్ఎస్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేస్తున్నాం: రాహుల్ గాంధీ