Charles Sobhraj: నేపాల్ జైలు నుంచి ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ విడుదల
కరుడుగట్టిన ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ (78) శుక్రవారం నేపాలీ జైలు నుంచి విడుదలయ్యాడు. 1970వ దశకంలో ఆసియా దేశాల్లో అనేకమంది యువ విదేశీయుల మహిళల హత్యలకు కారణమైన శోభరాజ్.. 19ఏళ్లుగా నేపాల్‌లో జైలు జీవితం గడుపుతున్నాడు.

Charles Sobhraj
Charles Sobhraj: కరుడుగట్టిన ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ (78) శుక్రవారం నేపాలీ జైలు నుంచి విడుదలయ్యాడు. 1970వ దశకంలో ఆసియా దేశాల్లో అనేకమంది యువ విదేశీయుల మహిళల హత్యలకు కారణమైన శోభరాజ్.. 19ఏళ్లుగా నేపాల్‌లో జైలు జీవితం గడుపుతున్నాడు. 2017లో గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న శోభరాజ్ అనారోగ్య కారణాల రిత్యా విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. దీంతో శుక్రవారం చార్లెస్ జైలు నుంచి విడుదలయ్యాడు.
ఉత్తర అమెరికాకు చెందిన ఇద్దరు పర్యాటకులను హత్యచేసిన కేసులో శోభరాజ్‌ను 2003లో ఖాట్మండు పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో సుప్రీంకోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి జైలులోనే శోభరాజ్ ఉంటున్నారు. నేపాల్‌లో జీవిత ఖైదు అంటే 20సంవత్సరాలు. అదేవిధంగా ఖైదీ తన శిక్షాకాలంలో 75శాతాన్ని సత్ప్రవర్తన కలిగిఉంటే అతన్ని ముందుగానే విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో 19ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్న చార్లెస్.. సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. వయస్సు, అనారోగ్య కారణాల రిత్యా చార్లెస్ ను జైలు నుంచి విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో శుక్రవారం నేపాల్ జైలు నుంచి అతన్ని విడుదల చేశారు.
Charles Sobhraj: 19 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదల కానున్న చార్లెస్ శోభరాజ్.. నేపాల్ కోర్టు ఆదేశం
జైలు నుంచి విడుదల చేసి తదుపరి ప్రక్రియకోసం ఇమ్మిగ్రేషన్ అధికారులకు అప్పగించారు. అతడిని ఫ్రాన్స్ కు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శోభరాజ్ భారత్ లోనూ పలు హత్యలకు పాల్పడ్డాడు. దీంతో 1976 అరెస్టై వివిధ జైళ్లలో జైలు శిక్ష అనుభవించాడు. చార్లెస్ శోభరాజ్ కు బికినీ కిల్లర్ అనే పేరుతోకూడా పిలుస్తారు.