OMG.. 475ఫీట్ల టవర్‌ని 25నిమిషాల్లో ఎక్కేశాడు

  • Published By: veegamteam ,Published On : March 6, 2020 / 06:49 AM IST
OMG.. 475ఫీట్ల టవర్‌ని 25నిమిషాల్లో ఎక్కేశాడు

Updated On : March 6, 2020 / 6:49 AM IST

స్పైడర్‌మ్యాన్‌ సినిమాలో టామ్‌ హోలాండ్‌ పెద్ద పెద్ద రిస్కీ ఫీట్లు చేసి అందరిని అక్కట్టుకున్న విషయం తెలిసిందే. రీల్‌లైఫ్‌ లో ఎవరైనా చేస్తారు. కానీ రియల్ లైఫ్ లో ఫీట్స్‌ చేయడం అనేది ఓ గొప్ప విషయం. అసలు రియల్ లైఫ్ లో రిస్కీ ఫీట్లు చేస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా? అయితే ఇప్పుడు చూడండి..

రిస్కీ ఫీట్ అంటే ఇదే అనేలా ఓ వ్యక్తి ఏకంగా 475 అడుగుల ఎత్తైన టవర్‌ను ఎక్కి రియల్‌ స్పైడర్‌మ్యాన్‌ అనిపించుకున్నాడు. ఫ్రెంచ్‌కు చెందిన క్లింబర్‌ ఎలైన్‌ (57 ఏళ్లు) రాబర్ట్‌ బార్సిలోనాలోని గ్లాస్‌తో డిజైన్‌ చేసిన టొర్రే అక్బర్‌ 145 మీటర్ల (475 అడుగులు) ఎత్తైన టవర్‌ ను కేవలం 25 నిమిషాల్లో ఎక్కేశాడు. 

ఆ సమయంలో అతను ఎలాంటి రోప్స్‌ కానీ సపోర్ట్‌కానీ తీసుకోలేదు. కేవలం చేతులు, కాళ్లతో టొర్రే అక్బర్‌ టవర్‌ ఎక్కి అందరి మనసులు గెలిచాడు. కేవలం 25 నిమిషాల్లోనే టవర్‌పైకి వెళ్లి కిందకి రావడానికి 47 నిమిషాలు పట్టింది. ప్రాణాలను రిస్క్‌ పెట్టి ఈ ఫీట్‌ చేసిన ఎలైన్‌ రాబర్ట్‌ను అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. అయితే పోలీసులు మాత్రం ఎలైన్‌ రాబర్ట్‌ను అదుపులోకి తీసుకున్నారు.  

See Also | వైరల్ : ప్రేమ కోసం 2 వేల కిలోమీటర్లు ప్రయాణం