కరోనా స్పెషల్.. షేక్ హ్యాండ్‌లకు బదులు లెగ్ షేక్ ఎలాగో తెలుసా!

కరోనా స్పెషల్.. షేక్ హ్యాండ్‌లకు బదులు లెగ్ షేక్ ఎలాగో తెలుసా!

Updated On : March 3, 2020 / 10:02 AM IST

గాలిలో ఉన్న దుమ్ము.. చేతులకు అంటిన ఇన్ఫెక్షన్ కారణంగా కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి అంటుతుందని తెలుసు కదా.  ఈ భయంతోనే చైనా ప్రజలు హ్యాండ్ షేక్ ఇవ్వడం మానేశారు. ఈ పద్ధతికి బదులు కొత్తగా లెగ్ షేక్ చేస్తున్నారు. ఇదేదో కరోనా వైరస్ ఎఫెక్ట్‌కు కామెడీగా చేసిన స్టంట్ కాదు. సీరియస్‌గానే పరస్పరం లెగ్ షేక్ చేసుకుని పలకరించుకుంటున్నారు. 

మరీనా రుద్యాక్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్టు చేశారు. మాస్క్ ధరించిన వ్యక్తి.. వ్యాన్‌లో నుంచి బయటికొస్తుండగా ఎదురొచ్చిన వాళ్లను పలకరిస్తున్నాడు. స్నేహితులందరితోనూ ఇదే విధంగా చేస్తున్న ఘటన మనకు నవ్వు తెప్పిస్తుండొచ్చు కానీ, అక్కడ పరిస్థితులను బట్టి అది తప్పదు. 

ఆ ట్విట్టర్ యూజర్ పెట్టిన పోస్టులో ‘షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కుదరకపోతే ఇంకేం చేస్తాం..’ అంటూ కామెంట్ చేసింది. ఈ వీడియోకు ఒక్క రోజులో మూడు లక్షల లైకులు, లక్ష మంది నుంచి కామెంట్లు వచ్చాయంటే ఎంత వైరల్ అయిందో చెప్పనక్కర్లేదేమో. ఇక ఈ వీడియోకు వచ్చిన కామెంట్లు మాత్రం నవ్వు తెప్పిస్తున్నాయి. 

కొందరు నెటిజన్లు భారతీయులు అనుసరించే నమస్తే పద్ధతి కరెక్ట్ అంటుంటే మరికొందరు ఫన్నీగా తీసుకుంటూ కొత్తవి ట్రై చేయమంటున్నారు. 

చైనాలో కరోనా ఎఫెక్ట్‌తో సోమవారం 42మంది మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా 3వేల మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలోని హుబీ ప్రాంతంలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే అమెరికాలో రెండో కరోనా మృతి సంభవించినట్లు అధికారులు ధ్రువీకరించారు.