friendship day 2023 : నిజమైన స్నేహితులు ఎలా ఉండాలో చెప్పిన మానసిక తత్వవేత్త .. మీరు అలా ఉన్నారా..?

కలిసి చదువుకున్నంతమాత్రాన అందరు స్నేహితులు అవ్వరు. కలిసి పనిచేసినంత మాత్రాన స్నేహితులు అవ్వరు. స్నేహితులు అని చెప్పుకోవాలంటే ఓ భావన ఉండాలి. స్నేహితులు ఎలా ఉండాలి..?

friendship day 2023

friendship day 2023 : స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అని ఓ కవి చెప్పిన మాట ఎంత వాస్తవమో కదా..స్నేహితులు నిజంగా బలమే. కలిసి చదువుకున్నవారంతా స్నేహితులు అవ్వరు. పరియం అయినవారంతా స్నేహితులవ్వరు. పక్క ఇళ్లున్నవారు కూడా స్నేహితులు కాలేదు. స్నేహం ఓ విలువైన. చాలా చాలా గొప్పది. చిన్నపాటి పరిచయాలనే స్నేహం అనుకోకూడదు. స్నేహం అంటే విలువైనదే కాదు అపురూపమైనది. కానీ ఈరోజుల్లో ఫ్రెండ్స్ అనే మాటకు..ఫ్రెడ్షిప్ అనే మాటని కలుషితం చేస్తున్నారు. ఆర్థికంగా వాడేసుకుంటున్నారు.

కానీ నిజమైన స్నేహం అంటే అదికాదు. కలిసి చదువుకున్నంతమాత్రాన అందరు స్నేహితులు అవ్వరు. కలిసి పనిచేసినంత మాత్రాన స్నేహితులు అవ్వరు. స్నేహితులు అని చెప్పుకోవాలంటే ఓ భావన ఉండాలి. స్నేహితులు ఎలా ఉండాలి..? ఏదో సంవత్సరానికి ఒకసారి కలిసి ఒకరోజంతా గడిపేసి ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోవటం కాదు. స్నేహం అంటే స్నేహితులు ఎలా ఉన్నారో వారి గురించి తెలుసుకోవాలి. వాళ్లు నిజమైన స్నేహితులేనా..? అని తెలుసుకోవాలి. లేదంటే స్నేహం అనే మాటలే చెడ్డపేరు వస్తుంది.

International Friendship Day 2023 : స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకోండి.. స్నేహితుల చెయ్యి వదిలిపెట్టకండి

స్నేహాల్లో మూడు దశలు..
అటువంటి స్నేహం గురించి..స్నేహాల్లో మూడు దశలు ఉన్నాయని మరి ముఖ్యంగా యువతరం స్నేహాల్లో మూడు దశలున్నాయని ఆడర్సన్‌ అనే మనస్తత్వ వేత్త (psychologist Anderson)ఏమని చెప్పారంటే..మొదటి దశలో వ్యక్తిగత సంబరధం ఉండదు. కలిసి చేసే వనులవైనే ఆధారవడి ఉరటుంది. 15 ఏళ్ల తర్వాత మొదలయ్యే రెండో దశ నమ్మకం పై ఆధారవడి ఉంటుంది. ఆపై సోషల్‌ సపోర్ట్‌, భద్రత ముఖ్య పాత్రగా వహిస్తాయని చెప్పాల్సిందే. స్నేహం నిరంతరం పెరిగేలా వ్రవర్తించాలి తప్ప చిన్నచిన్న విషయాలకే అలకలు..సాకులు చెప్పకూడదు.

అటువంటి ప్రవర్తను కలిగి ఉన్నవారితో సమన్వయంగా వ్యవహరించాలి. అటువంటి వ్రవర్తనలు ఉంటే గమనించుకుని మనల్ని మనం మార్చుకోపాలి. చిన్న చిన్న విషయాలను వట్టించుకోకూడదు. స్నేహితుడు నీకు చెవ్పకుండా ఎక్కడికన్నా వెళితే ‘వాడు అంతేరా సెల్ఫిష్‌’ అని అనుకూడదు. మరోస్నేహితుడి వద్ద ఆ మాట అనకూడదు. అంతేకాదు ఓ స్నేహితుడు మిమ్మల్ని నమ్మి తనలో లోపం గురించి సమస్యల గురించి చెప్పుకుంటే మీరు మరో స్నేహితుడి వద్ద ఆ విషయాలు ప్రస్తావించకూడదు. వీలైతే ఆ సమస్యల్ని పరిష్కరించేలా ఉండాలి తప్ప మీపై ఉన్న నమ్మకాన్ని కోల్పోయేలా చేసుకోకూడదు.

విమర్శ మనసులో ముల్లులా గుచ్చుకోకుండా, చెవ్పే మాటలు సున్నితంగా ఉండేలా జాగ్రత్తగా చెప్పాలి. వీడు చెప్పింది నిజమేరా అని అనిపించేలా ఉండాలి. ఒక స్నేహితుడిలోని లోపాలను మరో స్నేహితుడి వద్ద వ్రస్తావించకుండా ఉంటేనే మంచిది..అలా చేస్తే అది స్నేహం అనిపించుకోదు సరికదా..ఉన్న స్నేహం పోగొట్టుకున్నట్లే అవుతుంది. మిత్రునిలోని మంచి గుణాలను మెచ్చుకోవలి తప్ప అదేపనిగా పొగడకూడదు. అసలు స్నేహంలో ప్రశంసలు ఉండాలి తప్ప పొగడ్తలు ఉండకూడదు.

Friendship Day 2023 : క్యాన్సర్‌తో బాధపడుతున్న స్నేహితురాలికి అండగా నిలబడిన బాల్య స్నేహితులు .. ఇదే కదా అసలైన స్నేహమంటే

స్నేహితుని మాటల్లో, వ్రవర్తనలో నిగూఢ అర్థాలున్నాయోమోననే అనుమానాలు పెట్టుకోకూడదు. ఉదాహరణకు ఇచ్చే బముమతులను బట్టి స్నేహాన్ని చూడకూడదు. అసలు ఆర్థిక స్థాయిల గురిచి అస్సలు మాట్లాడకూడదు. స్థాయిని బట్టి చేసేదాన్ని స్నేహం అనకూడదు. స్నేహంలో పేద గొప్పా తేడా ఉండకూడదు.ఉంటే అది స్నేహం అనిపించుకోదు. స్నేహంలో నిజాయితీ, పారదర్శకత చాలా చాలా ముఖ్యం..మరి మీరు ఇలా ఉన్నారా?..ఇలా ఉంటే ఆ స్నేహం ఎప్పటికి నిలిచి ఉంటుందని..దానికి అంతమనేదే ఉండదని చెబుతున్నారు మానసిక తత్వవేత్తలు..

 


 

ట్రెండింగ్ వార్తలు